Xiaomi 5A Smart TV: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ఇప్పుడు మరో కొత్త స్మార్ట్ టీవీ సేల్ అందుబాటులోకి వచ్చేసింది. Xiaomi 5A స్మార్ట్ టీవీ సేల్ ను శనివారం (ఏప్రిల్ 30) నుంచి ప్రారంభించారు. ఈ సేల్ ద్వారా Xiaomi 5A స్మార్ట్ టీవీకి చెందిన వేరియంట్స్ ను 32, 40, 43 అంగుళాల రూపంలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ టీవీ ప్రారంభం ధర రూ. 13,499 గా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ Xiaomi 5A స్మార్ట్ టీవీని మరింత తక్కువ ధరకు కూడా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ టీవీ మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయోచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 


Xiaomi 5A స్మార్ట్ టీవీ ఆఫర్స్..


Xiaomi 5A స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో రూ. 24,999 ధరకు విక్రయిస్తున్నారు. అయితే ఈ టీవీపై ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో 38 శాతం డిస్కౌంట్ తో అంటే రూ. 15,499 ధరకే అమ్మకానికి ఉంచారు. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుపై వివిధ బ్యాంకుల ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 


ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు సమయంలో ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు యూజ్ చేయడం వల్ల 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అంతే కాకుండా HDFC బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు యూజ్ చేయడం వల్ల దాదాపుగా రూ. 2 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 13,499 ధరకు వస్తుంది. 


ఇంతే కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా దాని కండిషన్ ను బట్టి అత్యధికంగా రూ. 11 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. దీన్ని మొత్తం పొందినట్లయితే Xiaomi 5A స్మార్ట్ టీవీ ధర రూ. 2,499 వద్దకు చేరుతుంది.  


Also Read: Mobile Charging Tips: మొబైల్ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఈ 5 తప్పులు చేయకండి!


Also Read: Vodafone Idea Plan: వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ ఫీచర్ ఇకపై అందుబాటులో ఉండదు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.