Xiaomi Robot: స్మార్ట్ ఫోన్ రంగంలో దూసుకుపోతున్న షావోమీ మరో సంచలనానికి తెరలేపింది. పెద్ద పెద్ద కంపెనీలు చేయలేనిదాన్ని సుసాధ్యం చేసింది. నిత్యజీవితంలో ఉపయోగపడే రోబోల్ని విడుదల చేయనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షావోమీ కంపెనీ (Xiaomi)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్‌లో ప్రవేశించి దూసుకుపోతోంది. ప్రత్యర్ధి కంపెనీలకు పోటీగా మారి సవాలు విసురుతోంది. మార్కెట్‌లో వాటా పెంచుకుంటూ పోటీ కంపెనీలకు వణుకు పుట్టిస్తోంది. ఇప్పుడు నిత్య జీవితంలో ఉపయోగపడే రోబోల్ని తయారు చేసి..మార్కెట్‌లో త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. టెక్నాలజీ, ఇంజనీరింగ్‌లో తనకు తానే సవాల్ విసురుతోంది. మార్కెట్‌లో ఉన్న ఇతర కంపెనీలు సైతం విస్మయం చెందేలా సైబర్‌డాగ్ పేరుతో క్వాడ్రుపెడ్ రోబో(Cyberdog Quadruped Robot)ని తయారు చేసింది. నాలుగు కాళ్లపై నడిచే రోబోకు సంబంధించిన కీలకాంశాల్ని ఎంఐ ప్యాడ్ 5 రిలీజ్ సందర్భంగా షావోమీ వెల్లడించింది.


ఇంట్లో మనుషులకు పనుల్లో సహాయకారిగా ఉండేలా సైబర్‌డాగ్‌ను(Cyberdog)తయారు చేశారు. కచ్చితత్వానికి మారుపేరుగా క్వాడ్రుపెడ్  పనిచేస్తోందని షావోమీ చెబుతోంది. ఇంటెల్ రియల్ సెన్స్ ప్రోసెసర్‌ని ఉపయోగించారు. క్వాడ్రుపెడ్ రోబో సెకన్‌కు 3.2 మీటర్లు కదులుతూ..గరిష్టంగా 3 కేజీల బరువు మోయగలదు. నివిడియా సూపర్ కంప్యూటర్ శ్రేణికి చెందిన చిప్‌సెట్‌ను ఈ రోబోకు అమర్చారు. ముందుగా వేయి సైబర్‌డాగ్ రోబోల్ని తయారు చేయనుంది. చైనా మార్కెట్‌లో విడుదల చేసిన తరువాత ఇతర దేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఈ క్వాడ్రుపెడ్ రోబో ధరను చైనా 9 వేల 999 యువాన్లుగా నిర్ణయించింది. అంటే ఇండియన్ కరెన్సీలో(Cyberdog price) 1 లక్షా 14 వేల 737 ఉండవచ్చని అంచనా.


Also read; RBI కీలక నిర్ణయం: సామాన్యులే కాదు ఇకపై బ్యాంకులు కూడా జరిమానా కట్టాల్సిందే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook