Yamaha MT 15 V2 Features and Price: స్పోర్ట్స్‌ బైక్‌లను విడుదల చేసే కంపెనీల్లో యమహా ఎప్పుడు ముందుంటుంది. భారత మార్కెట్‌లో యామహా ఆర్‌వన్‌ఫై ఎంత ప్రాముఖ్యత కలిగిందో అందరికీ తెలిసిందే. ఇది మార్కెట్‌లో చాలా రకాల వేరియంట్స్‌ల్లో లభిస్తోంది. అయితే MT అనే స్పోర్ట్స్‌ బైక్‌ను ఇటీవలే యమహా విడుదలు చేసింది. ఈ బైక్‌కు చాలా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇది మార్కెట్‌లో 155 cc సెగ్మెంట్‌లో  లభిస్తోంది. అయితే ఈ సంవత్సరంలో యమహా MT 15 V2  అప్‌డేట్ వెర్షన్‌ విడుదల చేసింది. ఇది అన్ని స్పోర్ట్స్‌ బైక్‌లా కాకుండా ఓ ప్రత్యేక ఉంది. అయితే ఆ ప్రత్యేక ఏమిటో, ఫీచర్లు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యమహా MT 15 V2 అప్‌డేట్ వెర్షన్‌ 56.87 kmpl మైలేజీ ఇస్తుంది. అంతేకాకుండా చాలా రకాల కొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి విడుదలైంది. ఇది 18.4 PS అనే శక్తివంతమైన ఇంజన్ కలిగి ఉండడం వల్ల  14.1 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ ప్రమాదాలకు గురికాకుండా రెండు వీల్స్‌కి డిస్క్ బ్రేకులను అందించారు. ఇవే కాకుండా ట్యూబ్‌లెస్ టైర్లు, LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీని లాంటి చాలా రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఇందులో ఉన్న Wi-Connect స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా బైక్‌ను స్మార్ట్‌గా కంట్రోల్‌ చేయోచ్చు. అంతేకాకుండా యమహా MT 15 V2 అప్‌డేట్ వెర్షన్‌లో రైడర్ కాల్‌లు, ఇ-మెయిల్, హెచ్చరికలు సందేశాలను కూడా అందిస్తుంది. మీరు స్పీడ్‌గా వెళ్లే క్రమంలో లిమిట్‌ దాటితే ప్రమాద హెచ్చరికలను కూడా అందించే అవకాశాలున్నాయి. ఇది అప్‌డేట్‌ వేరియంట్‌ కావడంతో ఇంకా చాలా రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.  


ఇది కూడా చదవండి: MS Dhoni's Tweet on Jadeja: పదేళ్ల క్రితం జడేజా ఫీల్డింగ్‌పై ధోనీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్


ప్రస్తుతం భారత మార్కెట్‌లో యమహా mt15 v2 అప్‌డేట్ వెర్షన్‌  6 రంగులను కలిగి ఉంది. కానీ వినియోగదారులు ఎక్కువగా వైట్‌ అండ్‌ రెడ్‌తో కూడిన బైక్‌లను ఎక్కువ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇక ధరల విషయానికొస్తే.. రూ. 1.68 లక్షలతో (ఎక్స్-షోరూమ్‌) మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా అప్‌డేట్ వెర్షన్‌లో మెటాలిక్ బ్లాక్, డార్క్ మ్యాట్ బ్లూ, ఐస్ ఫ్లూ-వెర్మిలియన్, సియాన్ స్టార్మ్, రేసింగ్ బ్లూ, మెటాలిక్ బ్లాక్ DLXకు ఎక్కువ ప్రధాన్యత ఉంది.


ఇక యమహా MT 15 V2 బరువు విషయానికొస్తే.. 141 కిలోలు కంటే ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో లాస్ట్ పార్క్ లొకేషన్, లాస్ట్ పార్క్ చేసిన లొకేషన్, మైలేజ్, మాల్‌ఫంక్షన్ అలర్ట్‌లు, పోస్ట్-రైడ్ LED సూచికలు ఉన్నాయి. ఇది LED హెడ్‌లైట్, టెయిల్ ల్యాంప్, సైడ్ స్టాండ్ ఇంజన్ మొదలైన కొత్త ఫీచర్లను కలిగి ఉంది. అయితే తక్కవ బడ్జెట్‌లోని స్పోర్ట్స్‌ బైక్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఇది తప్పకుండా తీసుకోవచ్చు.


ఇది కూడా చదవండి: MS Dhoni's Tweet on Jadeja: పదేళ్ల క్రితం జడేజా ఫీల్డింగ్‌పై ధోనీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook