Tata Safari Prices: టాటా మోటార్స్ నుంచి ఆటోమొబైల్ మార్కెట్లోకి వచ్చిన నెక్సాన్ కారుకి దేశంలో కస్టమర్స్ నుంచి భారీ ఆధరణ లభించింది. ఫిబ్రవరి 2023 నెలలో అత్యధికంగా అమ్ముడైన SUV కార్ల జాబితాలో టాటా నెక్సాన్ కారు రెండో స్థానంలో నిలవడమే అందుకు నిదర్శనం. 5 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ SUV కారు ధరలు బేసిక్ వేరియంట్ కి రూ. 7.80 లక్షల నుండి ప్రారంభమై టాప్ వేరియంట్ కి రూ. 14.35 లక్షల వరకు ఉన్నాయి. టాప్ వేరియంట్ నెక్సాన్ కారు అన్ని టాక్సులు కలిపి ఆన్-రోడ్ ధర రూ. 16.56 లక్షలు వరకు ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ టాటా నెక్సాన్ కారు టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లయితే, అదే ధరలో అంతకంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న టాటా సఫారి కారుని కూడా ఎంచుకోవచ్చు అంటున్నారు ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్స్. టాటా సఫారీ SUV కారు బేసిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.65 లక్షలు కాగా ఇందులో రెండు రకాల సీటింగ్ కాన్ఫిగరేషన్ల డిజైన్లతో అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి 6 సీట్లు కాగా మరొకటి 7 సీటింగ్ కారు. 6 సీట్ల వేరియంట్‌ కారు ఇంటీరియర్ మధ్య వరుసలో కెప్టెన్ తరహా సీట్లు అమర్చి ఉంటాయి.


టాటా సఫారి కారు XE, XM, XMS, XT+, XZ, XZ+ పేరిట మొత్తం 6 ట్రిమ్‌లలో లభిస్తోంది. ఇందులో బేస్ వేరియంట్ అయిన XE మోడల్ కారులోనూ చాలా ఫీచర్లు లభిస్తున్నాయి. టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, డిఆర్ఎల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, వెనుక భాగంలో పార్కింగ్ సెన్సార్స్, ABS, సీట్-బెల్ట్ అలర్ట్ అలారం, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్‌లో ఇబ్బందులు లేకుండా హిల్ హోల్డ్ కంట్రోల్, ప్రయాణికుల సౌకర్యం కోసం సెకండ్ రోలో రిక్లైనింగ్ సీట్లు వంటి లేటెస్ట్ ఫీచర్స్ లభిస్తున్నాయి. 


టాటా సఫారి కారు విషయంలో చెప్పుకోదగిన మరో విశేషం ఏంటంటే, టాటా సఫారి 2 లీటర్ డీజిల్ ఇంజన్ 170PS పవర్, 350Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్ సిస్టంతో లభిస్తుంది. వివిధ కార్లలో కొత్తగా యాడ్ అవుతున్న ADAS సహా అనేక ఇతర ఫీచర్లు టాటా సఫారీలోనూ యాడ్ అయ్యాయి. మొత్తానికి సీటింగ్ పరంగా చూసినా, లేటెస్ట్ ఫీచర్స్ పరంగా చూసినా 5 సీటింగ్ కెపాసిటీ కలిగిన నెక్సాన్ కారు ధరలోనే 7 సీటర్ SUV కారు లభిస్తోందన్నమాట.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook