EPFO: ఈపీఎఫ్ఓ ద్వారా మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే..మీ బేసిక్ సాలరీ ఎంత ఉండాలో తెలుసుకోండి
EPFO Basic Pay: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా..అయితే ఈపీఎఫ్ఓ ద్వారా నెలకు రూ. 10,000 పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా..అయితే ఈ కాలిక్యులేటర్ ద్వారా లెక్క సరిచూసుకోండి..
EPFO Basic Pay: కేంద్రంలోని మోదీ సర్కార్ త్వరలోనే ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యులు అయితే ఇకపై మీ నెలవారీ రూ. 10,000 పెన్షన్ పొందవచ్చు. అయితే మీ నెలవారీ బేసిక్ జీతం ప్రస్తుతం రూ.15 వేలు ఉంటే, మీరు పదవీ విరమణ వరకు రూ.10 వేలు పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు. EPFO కింద పెన్షన్‌కు అర్హత పొందాలంటే, ఒక వ్యక్తి EPS సభ్యునిగా కనీసం 10 సంవత్సరాల కంట్రిబ్యూషన్‌ను పూర్తి చేసి ఉండాలి. EPS కింద పెన్షన్ 58 సంవత్సరాల వయస్సు నుండి ప్రారంభమవుతుంది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రభుత్వం ఈపీఎఫ్‌వో కింద బేసిక్ పే పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచవచ్చని ఇటీవల కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ ఎల్ మాండవియా సూచించారు. ఈ పెరుగుదల 2025 నుండి అంచనా వేశారు. ఒక ఉద్యోగి రూ.10,000 పెన్షన్ ఎలా పొందవచ్చో ఉదాహరణతో అర్థం చేసుకుందాం.
ఉదాహరణకు ఒక వ్యక్తి 2015 జనవరిలో ఒక కంపెనీలో చేరాడు అనుకుందాం. అప్పట్లో అతని బేసిక్ పే లిమిట్ రూ.15,000. ఇప్పుడు ప్రాథమిక వేతన పరిమితిని జనవరి 2025లో సవరించవచ్చని భావిస్తున్నారు. అప్పుడు బేసిక్ పే లిమిట్ రూ.21 వేలకు పెరుగుతుంది. ఆ వ్యక్తి 35 ఏళ్లు పనిచేసి 2049లో పదవీ విరమణ చేస్తాడు అనుకుందాం. ఇప్పుడు 10 వేల పెన్షన్ పొందాలంటే ఎలాగో EPF ఫార్ములా ద్వారా తెలుసుకుందాం.
EPS పెన్షన్‌ను లెక్కించడానికి ఫార్ములా
EPS = సగటు పెన్షనబుల్ జీతం x పెన్షనబుల్ సర్వీస్/70
వేతనంలో మొదటి భాగం: జనవరి 2015 నుండి డిసెంబర్ 2024 వరకు (10 సంవత్సరాలు), ప్రాథమిక వేతన పరిమితి: 15,000
వేతనంలో రెండవ భాగం: జనవరి 2025 నుండి డిసెంబర్ 2049 వరకు (25 సంవత్సరాలు), ప్రాథమిక వేతన పరిమితి: రూ. 21,000
పార్ట్-1: (10 సంవత్సరాలకు పెన్షన్ లెక్కింపు)
సగటు పెన్షన్ జీతం: రూ. 15,000
పెన్షనబుల్ సర్వీస్: 10 సంవత్సరాలు
పెన్షన్ = రూ 15,000×10/70 = నెలకు రూ 2,142.86
పార్ట్-2: (25 సంవత్సరాలకు పెన్షన్ లెక్కింపు)
సగటు పెన్షన్ జీతం: రూ. 21,000
పెన్షనబుల్ సర్వీస్: 25 సంవత్సరాలు
పెన్షన్ = రూ 21,000×25/70 = నెలకు రూ 7,500
35 ఏళ్ల సర్వీస్ తర్వాత మొత్తం పెన్షన్ = రూ. 2,142.86+ రూ. 7,500 = నెలకు రూ. 9,642.86. ఈ విధంగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆ వ్యక్తికి నెలకు దాదాపు రూ.10 వేలు పింఛను అందుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.