SBI Pension Loan: దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) పెన్షనర్లకు సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. పెన్షనర్లకు ఎస్‌బీఐ పెన్షన్ లోన్ అందిస్తోంది. ఇందుకోసం కేవలం ఒక్క SMS చేస్తే చాలని భరోసా కల్పించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పింఛన్‌ తీసుకునేవారు, డిఫెన్స్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు ఈ పెన్షన్ లోన్ తీసుకునేందుకు అర్హులు అని ప్రకటించింది. 9.75 శాతం వడ్డీతో హ్యాపీ రిటైర్మెంట్ అంటోంది. PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు మెస్సేజ్ చేయాలని తన ట్వీట్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) పేర్కొంది.


Also Read: EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు


మీ పిల్లల పెళ్లిళ్లు చేయడానికి, మీ డ్రీమ్ హోమ్ కొనుగోలు చేసేందుకు, మెడికల్ అవసరాల కోసం రిటైర్మెంట్ ఫండ్ తరహాలో ఎస్‌బీఐ పెన్షనర్లకు పెన్షన్ లోన్ అందిస్తుంది. పూర్తి వివరాల కోసం కస్టమర్ కేర్ నెంబర్ 1800-11-2211 కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా 7208933142కు మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఎస్‌బీఐ(SBI Latest News) కాంటాక్ట్ సెంటర్ నుంచి కాల్ బాక్ చేస్తారు. 


Also Read: Personal loans: ఈజీగా పర్సనల్ లోన్స్ కావాలా ? Paytm app లో ఈ ఆప్షన్ చూడండి


రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు SBI పెన్షన్ లోన్ అర్హతలివే
- పెన్షనర్ల వయసు 76 కన్నా తక్కువ ఉండాలి
- ఎస్‌బీఐ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కలిగి ఉన్న వారు అర్హులు


డిఫెన్స్ పెన్షనర్లకు అర్హతలివే
- ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారా మిలిటరీ బలగాలు(CRPF, CISF, BSF, ITBP), కోస్ట్ గార్డ్స్, రాష్ట్రీయ రైఫిల్స్ మరియు అస్సా రైఫిల్స్ లాంటి సాయుధ బలగాలకు చెందిన పెన్షనర్లు అయి ఉండాలి
- పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఎస్‌బీఐ మెయింటెయిన్ చేయాలి
- ఇందులో కనీస వయసు లాంటివి లేవు
- గరిష్ట వయసు 76 సంవత్సరాలు


Also Read: EPFO: ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి కొత్త PF Tax Rules, దీని ప్రభావం ఇలా ఉండనుంది


ఫ్యామిలీ పెన్షనర్లకు ఎస్‌బీఐ పెన్షన్ లోన్ పొందేందుకు అర్హతలు
- పెన్షనర్ మరణిస్తే ఆ నగదు స్వీకరించేందుకు అర్హత కలిగి ఉన్న వారి కుటుంబ సభ్యులు
- పెన్షనర్ కుటుంబసభ్యుడు, లేక సభ్యురాలి వయసు 76 ఏళ్లకు మించరాదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook