Public Provident Fund: కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపీఎఫ్‌లో పెట్టుబడి పరిమితిని పెంచాలని అన్ని వైపులా నుంచి డిమాండ్ వస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై ఆలోచించాలని కోరుతున్నారు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే డబ్బు సురక్షితంగా ఉండడంతోపాటు.. మంచి రాబడి వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది సామాన్యులు పీపీఎఫ్ వైపు చూస్తున్నారు. అంతేకాకుండా ఇందులో ట్యాక్స్ సేవింగ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ రూ.1.5 లక్షల ఉండగా.. రూ.3 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయం పక్కనపెడితే.. మీరు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ తక్కువ వ్యవధిలోనే కోటీశ్వరుడు కావచ్చు. ఎలాగంటే.. ఒక సంవత్సరంలో గరిష్టంగా 1.50 లక్షల రూపాయల పీపీఎఫ్‌ ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు. ఉదహారణకు మీరు ప్రతి నెలా పీపీఎఫ్‌లో రూ.12,500 పెట్టుబడి పెట్టండి. 15 సంవత్సరాలలో మెచ్యూరిటీ తర్వాత మీరు పీపీఎఫ్‌ ఖాతాను 5-5 సంవత్సరాల బ్లాక్‌లలో పొడిగించవచ్చు. 30 సంవత్సరాల తర్వాత మీ పీపీఎఫ్‌ ఖాతా మొత్తం ఫండ్ 1.5 కోట్ల (1,54,50,911) కంటే ఎక్కువగా ఉంటుంది. ఇందులో మీ పెట్టుబడి రూ.45 లక్షలు, వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం దాదాపు రూ.1.09 కోట్లు అవుతుంది.


మీరు పీపీఎఫ్‌లో ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. అంత ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. మీ వయస్సు 25 సంవత్సరాలు, మీరు పీపీఎఫ్‌లో సంవత్సరానికి 1.5 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. అప్పుడు మీరు 55 సంవత్సరాల వయస్సులో అంటే పదవీ విరమణకు దాదాపు 5 సంవత్సరాల ముందు మీరు కోటీశ్వరుడు కావచ్చు.


నెలవారీ ప్రాతిపదికన వడ్డీ


పీపీఎఫ్‌లో నెలవారీ ప్రాతిపదికన వడ్డీ లెక్కిస్తారు. కానీ ఈ డబ్బు ఆర్థిక సంవత్సరం చివరిలో మీ ఖాతాలో జమ అవుతుంది. అంటే మీరు ప్రతి నెలా పొందే వడ్డీ మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో మీ పీపీఎఫ్‌ ఖాతాలో జమ అవుతుంది. పీపీఎఫ్‌లో డబ్బును ఎప్పుడు డిపాజిట్ చేయాలో నిర్ణీత తేదీ లేదు. మీరు నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన డబ్బును డిపాజిట్ చేయవచ్చు.


అధిక వడ్డీ పొందడానికి మార్గం 


ప్రతినెలా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పీపీఎఫ్‌పై వడ్డీని లెక్కిస్తారు. ఖాతాలో ఉన్న మొత్తంపై ఈ లెక్కింపు జరుగుతుంది. మీరు ఏదైనా నెలలో 5వ తేదీ వరకు పీపీఎఫ్‌ ఖాతాలో డబ్బును డిపాజిట్ చేస్తే.. అదే నెలలో ఆ డబ్బుపై వడ్డీ లభిస్తుంది. ఆ తరువాత డిపాజిట్‌ చేస్తే.. అంతకుముందు ఖాతాలో ఉన్న మొత్తంపైనే వడ్డీని లెక్కిస్తారు. 


ఉదాహరణకు మీరు ఏప్రిల్ 5న మీ ఖాతాలో రూ.50 వేలు జమ చేశారనుకోండి, మార్చి 31 వరకు మీ ఖాతాలో అప్పటికే రూ.10 లక్షలు ఉన్నాయి. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 30 వరకు.. మీ పీపీఎఫ్‌ ఖాతాలో మొత్తం రూ.10,50,000. దీనిపై నెలవారీ వడ్డీ 7.1%-(7.1%/12 X 1050000)=రూ.6212


ఇప్పుడు మీరు రూ.50 వేల మొత్తాన్ని ఏప్రిల్ 5న కాకుండా.. ఏప్రిల్ 6న డిపాజిట్ చేశారనుకుందాం. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 30 వరకు మీ ఖాతాలో కనీస నిల్వ రూ.10 లక్షలు. దీనిపై నెలవారీ వడ్డీ 7.1% (7.1%/12 X 10,00,000) = రూ.5917. మీరు డిపాజిట్ చేసిన డబ్బుపై ఆ తరువాత నెల నుంచి లెక్కిస్తారు. మీరు పీపీఎఫ్‌లో మీ డబ్బుపై ఎక్కువ వడ్డీని పొందాలనుకుంటే.. ఈ ట్రిక్‌ను పాటించండి. మీరు మంచి రాబడిని పొందాలనుకుంటే.. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన వెంటనే, ఏప్రిల్ 1 నుంచి 5 మధ్య డబ్బును పీపీఎఫ్‌లో డిపాజిట్ చేయండి.


Also Read: Ruturaj Gaikwad: టీమిండియాకు ఎదురుదెబ్బ.. కివీస్ టీ20 సిరీస్ నుంచి రుతురాజ్ ఔట్  


Also Read: MLC Kavitha: గవర్నర్‌కు ధన్యవాదాలు చెబుతూ ఎమ్మెల్సీ కవిత కౌంటర్.. ట్వీట్ వైరల్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి