Yulu Bajaj EV Scooter: మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటీలకు మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం అందరూ వీటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రముఖ యులు(Yulu)- బజాజ్ కంపెనీ ఎలక్ట్రిక్ 2-వీలర్ ప్లాట్‌ఫారమ్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం వస్తువులను, ఇతర ఆహారాలను డెలివరీలు చేయడానికి ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను తయారు చేసేందుకు ముందడుగు వేసింది. ఇది అన్ని స్కూటీల్లా ఉండడకకుండా డిఫరెంట్‌ స్టైల్‌లో ఉంటుంది.  అయితే ఈ కంపెనీ బైక్‌లకు సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యులు-బజాజ్ భాగస్వామ్యంతో తయారు చేస్తున్న స్కూటీలో చాలా రకాల కొత్త ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇంతముందు ఈ రెండు భాగస్వామ్యంతో తయారు చేసిన ఎలక్ట్రిక్‌ ఆటోలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ లభించడంతో ఎలక్ట్రిక్‌ స్కూటీలను తయారు చేస్తున్నట్లు సమాచారం.  ఈ బైక్‌లను AI-ఆధారిత టెక్నాలజీతో తయారు చేస్తున్నట్లు ఇప్పటికే కంపెనీ ఓ ప్రకటలో పేర్కొంది.


[[{"fid":"264102","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


యులు థార్డ్‌ జనరేషన్ ఇ-స్కూటర్ ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో మార్కెట్‌లోకి విడుదల కానుంది.  చేతక్ టెక్నాలజీ లిమిటెడ్‌తో కలిసి AI-ఆధారిత టెక్ స్టాక్‌ను ఉపయోగించి ఈ స్కూటీని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ స్కూటర్‌ వాతావరణ మార్పులకు అనుగుణంగా పని చేస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఇది సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తయారు చేసినట్లు సమాచారం. దీంతో మార్కెట్‌లో విడుదలైన తర్వాత తక్కువ ధరలకే లభించనుంది. వచ్చే ఏడాదిలోపే 100,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను రోడ్డుపైకి తీసుకురావాలనే లక్ష్యంతో యులు కంపెనీ వేగంగా తయారి పనులను ప్రారంభించింది.


[[{"fid":"264101","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


బ్యాటరీని సులభంగా మార్చుకోవచ్చు:
యులు ఎలక్ట్రిక్ స్కూటీతో వచ్చే బ్యాటరీ ఎంతో శక్తివంతమైనది. ఇంతవరుకు మార్కెట్‌లోకి విడుదలైన ఏ ఎలక్ట్రిక్‌ స్కూటీలో ఇలాంటి బ్యాటరీని వినియోగించలేదని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఓ బంఫర్‌ ఆఫర్‌ కూడా ప్రకటించింది. యులు స్టేషన్‌లలో ఎక్కడైన పాత బ్యాటరీని ఇచ్చి కొత్త బ్యాటరీని తీసుకోవచ్చు. దీనిని ఒక్క సారీ ఛార్జ్‌ చేస్తే ఒక రోజంతా నడిచే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇందులో ఉండే కొత్త ఫీచర్‌ వల్ల సులభంగా అన్ని వస్తువులను  డెలివరీ చేయోచ్చు.


Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook