Zoom App:  కొవిడ్ కారణంగా చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. విద్యార్థులు కూడా యాప్స్ ద్వారానే ఆన్ లైన్ క్లాసులు(online Classes) వింటున్నారు. దీంతో వర్చువల్ మీడియా కాన్ఫరెన్సింగ్ యాప్(Video conferencing app)లకు డిమాండ్ బాగా పెరిగింది. అందుకే ఈ యాప్స్ కొత్త ఫీచర్ల(New Feauters)పై దృష్టి పెట్టాయి.  
పాపులర్ ​వీడియో కాన్ఫరెన్సింగ్​ యాప్​ జూమ్​(Zoom)  తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. జూమ్ కాల్స్ కోసం రియల్ టైమ్, మల్టీ-లాంగ్వేజ్ ట్రాన్స్‌క్రిప్షన్(Multi-language transcription), ట్రాన్స్‌లేషన్ (Translation)ఫీచర్‌ను త్వరలోనే జోడిస్తున్నట్లు వెల్లడించింది. వర్చువల్​ సమావేశాలు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ఫీచర్‌  తీసుకురానున్నట్లు జూమ్ తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నచ్చిన భాషల్లో ట్రాన్స్‌లేట్‌..
విభిన్న  ప్రాంతాలు, వేర్వేరు భాషలకు చెందిన ప్రజలు ఇబ్బంది లేకుండా మాట్లాడుకుందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడనుంది. వీడియో కాల్స్​ సమయంలో వేర్వేరు భాషలకు చెందిన వారు ఇబ్బంది లేకుండా సమాచారాన్ని  ఇచ్చి పుచ్చుకునేందుకు గాను ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఎదుటి వ్యక్తి మాట్లాడుతుండగానే మనకు నచ్చిన భాషల్లోకి ట్రాన్స్‌లేట్‌ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇందుకు గాను జర్మనీకి చెందిన  కైట్స్​ (Kites)అనే సంస్థను జూమ్​ కొనుగోలు చేసింది. కైట్స్‌కు సంస్థలకు సంబంధించిన టెక్నాలజీని ఉపయోగించుకొని వర్చువల్​ మీటింగ్స్​ను మరింత సులభతరం చేయనున్నామని జూమ్​ చెబుతోంది.


Also Read: Deloitte Report on India: 5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా ఇండియా, కావల్సింది ఇదే అంటున్న ఆ సంస్థ


వచ్చే ఏడాది నుంచి అమలు...
ఈ లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. ఈ ఫీచర్​ ద్వారా మొత్తం 12 భాషల్లో లైవ్​ ట్రాన్స్‌లేషన్(Live translation)​ చేసుకోవచ్చు. అయితే ఏయే భాషలకు మద్దతిస్తుందనే విషయాన్ని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మనం చెప్పే విషయాలను టెక్స్ట్‌గా మర్చే ఫీచర్‌పై కూడా జూమ్​ పనిచేస్తుంది. దీని కోసం కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత అల్గారిథంలు, మెషిన్ లెర్నింగ్ (ML) టెక్నాలజీలను ఉపయోగించుకోనుంది. అయితే దీనిపై కంపెనీ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. జూమ్ ఆటోమేటెడ్ ట్రాన్స్‌క్రిప్షన్‌ని 30 భాషలకు పొడిగించాలని, వచ్చే ఏడాదిలో 12 భాషలకు లైవ్ ట్రాన్స్‌లేషన్‌ను జోడించాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించింది. 


ఇంటరాక్ట్ కోసం...వైట్ బోర్డు ఫీచర్
జూమ్‌లో వస్తున్న మరో అద్బుతమైన ఫీచర్ వైట్‌బోర్డ్. ఈ వైట్‌బోర్డ్(Whiteboard) డిజిటల్ కాన్వాస్‌గా పనిచేస్తుంది. రిమోట్, ఆఫీసు ఉద్యోగులు వర్చువల్ వైట్‌బోర్డ్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి రానుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook