Road Accident in Prakasam District: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్‌ కాల్వలోకి పెళ్లి బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి దాటాక దర్శి సమీపంలో జరిగింది. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35 నుంచి 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెళ్లి రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుల్లో పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్‌ అజీజ్‌(65),అబ్దుల్‌ హాని(60),షేక్‌ రమీజ్‌ (48),ముల్లా నూర్జహాన్‌ (58), ముల్లా జానీబేగం(65),షేక్‌ షబీనా(35),షేక్‌ హీనా(6) ఉన్నారు. 


భారీ వర్షాలకు 17 మంది మృతి


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాధి వణుకుతోంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ మరియు జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో ఈ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో వరదలు ధాటికి ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ చరియలు విరిగిపడటంతో రవాణా మార్గాలు క్లోజ్ అయ్యాయి. మరోవైపు బియాస్, యమునా నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఈ రెండు నదులు ఉప్పొంగి ప్రవహించడంతో చాలా వంతెనలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. 


Also Read: Havoc Floods: హిమాచల్ , ఢిల్లీ, హర్యానాలో కొనసాగుతున్న జల ప్రళయం, 72 మంది మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి