Students Suicide in AP: ఇంటర్‌ పరీక్షల్లో పాస్ కాలేదని.. మార్కులు తక్కువ వచ్చాయనే కారణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరు, విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. అనకాపల్లి, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ప్రాణాలు తీసుకున్నారు. మరో ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. పూర్తి వివరాలు ఇలా..  చిత్తూరు జిల్లాకు పుంగనూరు మండలం ఏటవాకిలికి చెందిన అనూష (17) అనే విద్యార్థిని ఇంటర్‌లో ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల అనూష కర్ణాటకలోని అమ్మమ్మ ఊరు వెళ్లగా.. ఫలితాలు వచ్చిన విషయాన్ని తల్లి ఫోన్ చేసింది. రెండు రోజుల్లో వచ్చి ఫీజు కడతానని.. ఈసారి తప్పకుండా పాస్ అవుతానని చెప్పింది అనూష. అయితే ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ.. అమ్మమ్మ ఊర్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరవుతున్నారు. ఇదే జిల్లా బైరెడ్డిపల్లెకు చెందిన బాబు(17) అనే విద్యార్థి ఇంటర్‌ సెంకడ్ ఇయర్ ఎంపీసీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్థాపానికి గురై.. పురుగుల మందుతాగి ప్రాణాలు తీసుకున్నాడు. 


అనకాపల్లికి చెందిన కరుబోతు తులసీ కిరణ్‌ (17) ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన బాలక తరుణ్‌ (17) అనే విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయనే బాధతో రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. తరుణ్ తల్లిదండ్రులు రాజమండ్రికి వలస వెళ్లి కూలీలుగా పనిచేస్తున్నారు. కొడుకు మరణంతో విషాదంలో ముగినిపోయారు. విశాఖపట్నానికి చెందిన మహిళ తన కూతురు అఖిలశ్రీ (16)ను కూలీ పనులకు వెళ్లి చదివిస్తోంది. ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడింది. 


వైజాగ్ పల్నాటి కాలనీ శ్రీనివాసనగర్‌కు చెందిన బోనెల జగదీష్‌ (18) ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ కావడంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జగదీష్ తండ్రి లేదు. తల్లి రామలక్ష్మి కష్టపడి కుమారుడిని చదవిస్తోంది. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్‌కు చెందిన మహేష్‌ (17) ఇంటర్ పరీక్షలకు హాజరుకాలేదు. ఈ విషయంపై తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన ప్రాణాలు తీసుకున్నాడు. 


ఎన్టీఆర్‌ జిల్లాలో నందిగామకు చెందిన షేక్‌ జాన్‌ సైదా (16) ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. మ్యాథ్స్‌లో ఒకటి, ఫిజిక్స్‌లో 6, కెమిస్ట్రీలో 7 మార్కులు రావడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిల్లకల్లుకు చెందిన విద్యార్థి రమణ రాఘవ  ఇంటర్‌ సెకండీయర్‌లో ఒక సబ్జెక్ట్ తప్పడడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లాలో ఇంటర్‌లో మొత్తం మూడు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు యత్నించాడు.


Also Read:  Dantewada Attack: దంతెవాడ ఘటనపై మవోయిస్టులు లేఖ విడుదల.. పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే..?  


Also Read: IPL Controversies: ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద వివాదాలు ఇవే.. ఎన్నటికీ మరువని ఘటనలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook