Gurugram Accident: ఢిల్లీలో స్కూటీపై వెళ్తున్న ఓ యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన తరహా ఉదంతం గురుగ్రామ్‌లో వెలుగు చూసింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరి యువకులను కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న యువకుడు కారు కింద ఇరుక్కుపోయాడు. ఈ ఘటన అనంతరం డ్రైవర్ కారును ఆపకుండా 4 కిలోమీటర్ల ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరిచినా ఆపలేదు
ఢీకొన్న తర్వాత యువకులిద్దరూ కేకలు వేసినా కారు ఆపలేదని పోలీసులకు ఆ యువకులు తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. వారు ఈ ఘటనపై గురుగ్రామ్‌లోని సెక్టార్-65 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితులు తమ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సెక్టార్-62 సమీపంలోకి రాగానే వేగంగా వచ్చిన కారు యువకుల బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బాధితులకు పెద్దగా గాయాలు కాలేదని పోలీసులు చెబుతున్నారు. 



గత నెలలో ఢిల్లీలోని కంఝవాలాలో ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది.  స్కూటీపై వెళ్తున్న 20 ఏళ్ల యువతిని కారు ఢీకొట్టింది. ఆమె కారులో ఇరుక్కుపోయినా సరే నిందితులు కారు నడుపుతూనే ఉన్నారు. ఈ ఘటనలో బాధితురాలు మృతి చెందింది.


Also Read: Pakistan: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-బస్సు ఢీ.. 17 మంది దుర్మరణం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook