Rajamahendravaram Crime: భార్యాభర్తలు ఇద్దరికి గవర్నమెంట్ కొలువులు. దేవుడు కోట్ల ఆస్తి ఇచ్చినా.. సంతానం ఇవ్వలేదని వారిద్దరు బాధపడ్డారు. పిల్లలు లేకపోవడంతో ఓ పేద కుటుంబంలోని నెలల పసిపాపను దత్తత తీసుకున్నారు. ఎంతో గారాబంగా చూసుకున్నారు. కూతురు అడిగినదానికి అడ్డు చెప్పకుండా అన్ని ఇచ్చారు. చివరకు ఆ అతి గారబమే పెంపుడు తల్లికి మరణశాసనమైంది. 13 ఏళ్ల వయసుకే ప్రేమలో పడిన ఆ బాలిక.. చెడు వ్యసనాలకు బానిసైంది. ప్రియుడు, స్నేహితులతో కలిసి తల్లినే హత్య చేసి కొత్త నాటకానికి తెరలేపింది. పోలీసుల రంగం ప్రవేశంతో గుట్టురట్టయింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం డీఎస్పీ విజయ్‌పాల్‌ ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజమహేంద్రవరంలోని కంబాలపేటకు చెందిన సిద్ధాబత్తుల మార్గరెట్‌ జులియాన (63) అనే రిటైర్డ్ ఉపాధ్యాయురాలు తన కూతురు (13)తో కలిసి జీవిస్తున్నారు. ఆమె భర్త నాగేశ్వరరావు ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసివారు. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో కాకినాడకు చెందిన ఓ పేద కుటుంబంలోని నెలల పసిపాపను దత్తత తీసుకుని పెంచుకున్నారు. ఎంతో గారాబంగా చూసుకున్నారు. చిన్నప్పటి నుంచి డబ్బుకు ఏ లోటులేకుండా చూసుకున్నారు. 


విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ఆ బాలిక చెడు వ్యసనాలకు అలవాటు పడింది. 13 ఏళ్లకే 19 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. లవర్, ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం, జల్సాలు కమాన్‌గా మారాయి. ఈ విషయంపై తల్లి మందలిస్తే.. వాగ్వాదానికి దిగేది. ఈ క్రమంలో స్నేహితుల తప్పుడు సలహాతో.. పెంచిన తల్లిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది.


ఈ నెల 17న బాత్‌రూమ్‌లో కాలు జారి కిందపడిన జులియాన.. రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ నెల 18న తెల్లవారుజామున నిద్రలోనే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని వెంటనే జులియాన మరిది, బాబాయ్ అంజియాకు ఫోన్‌ చేసి చెప్పింది ఆ బాలిక. సీతానగరం నుంచి ఆయన వచ్చి వెంటనే జులియానను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. జులియాన మృతిపై అనుమానంతో అంజియా పోలీసులకు కంప్లైంట్ చేశాడు. 


కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీసులు.. బాలిక చెప్పిన మాటలకు.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌కు సంబంధం లేకపోవడంతో ప్రత్యేక నిఘా ఉంచారు. రెండు బృందాలుగా వీడిపోయి విచారణ చేపట్టారు. ఆ బాలిక అదే ప్రాంతంలో ఉంటున్న గారా ఆకాష్‌ (19) అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్లు గుర్తించారు. జులియాన మరణించిన తరువాత ఆకాష్‌తోపాటు అతని ఇద్దరు ఫ్రెండ్స్ కనిపించకుండా పోయారు. 


ఈ నెల 18న జులియాన నిద్రపోయిన తరువాత అర్ధరాత్రి సమయంలో తన ప్రియుడు ఆకాష్‌, అతని స్నేహితులు వీపీ అక్షయ కుమార్‌ (20), దాస్యం దినేష్‌రాయ్‌(19)లను బాలిక ఇంటికి పిలిపించింది. వాళ్లు ఇంటికి రాకముందే సీసీ కెమెరాలను ఆఫ్ చేసింది. జులియాన నిద్రపోతుండగా.. దినేష్, అక్షయ్ కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. బాలిక, ఆకాష్‌ టవల్‌తో ముక్కు, నోరు మూసి ఊపరి ఆడకుండా హత్య చేశారు. నిందితులను అరెస్ట్ చేశామని.. కోర్టులో హాజరపరచనున్నట్లు డీఎస్పీ విజయ్‌పాల్ తెలిపారు. 


Also Read:  Kalyan Ram Devil : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో బాలీవుడ్ సెన్సేషనల్ నటి


Also Read: Karampudi Man Death News: కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. భార్య బిడ్డకు జన్మనిచ్చిన ఆసుపత్రికే భర్త మృతదేహం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook