Anjan Das Murder Case Was Revealed From Mobile Phone: నేరస్థుడు ఎంత తెలివైనవాడైనా, అన్ని కేసులలో కొన్ని ఆధారాలు వదిలివేస్తాడని మనం సినిమాల్లో వింటూ ఉంటాం, అది సినిమా డైలాగ్ కాదు నిజమే అని తేలింది. ఢిల్లీలో తన కొడుకు దీపక్‌తో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలు చేసిన పూనమ్ దేవి విషయంలో కూడా అదే జరిగింది. తన భర్త అంజన్ దాస్‌ను హత్య చేసిన తర్వాత పూనమ్ తన మొబైల్‌ను పోర్ట్ చేసింది. పాండవ్ నగర్‌లో దొరికిన మానవ శరీర భాగాల మిస్టరీని పోలీసులు ఛేదించిన క్లూ ఇదేనని ఇప్పుడు వెల్లడైంది. శ్రద్దా వాకర్ హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు పాండవ నగర్ లో దొరికిన శరీర భాగాలు కూడా ఆమెవే అనుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ అవి పురుషుడివి అని తేలడంతో అతను ఎవరై ఉండచ్చా అని దర్యాప్తు మొదలు పెట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అసలు విషయం ఏంటంటే భర్తను చంపిన తరువాత పూనమ్ తన నంబర్‌ను ఎయిర్‌టెల్ నుండి జియోకి పోర్ట్ చేసింది. అలాంటి పరిస్థితిలో, ఆమె మొబైల్ కొన్ని రోజులు స్విచ్ ఆఫ్ అయింది. క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొబైల్‌ పోర్ట్‌ చేస్తే కొన్ని రోజుల పాటు అది ఆఫ్‌ అవుతుంది. కానీ దీపక్ మొబైల్‌లో మాట్లాడుతుండగా సీసీటీవీ కెమెరాల్లో కనిపించాడు. నిజానికి దీపక్ మొబైల్‌లో మాట్లాడనప్పటికీ అక్కడ ఉన్న వారిని తప్పుదోవ పట్టించేందుకు మొబైల్‌ని చెవిలో పెట్టుకున్నాడని తేల్చారు.


ఈ క్రమంలో పోలీసులు ఆ ప్రాంతంలోని డంప్ డేటాను సేకరించి, ఆ సమయంలో ఎన్ని ఫోన్లు నడుస్తున్నాయి, ఆ సంఘటన తర్వాత ఎన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి అని చూశారు. లక్ష ఫోన్ల డంప్ డేటాను పోలీసులు సేకరించారు. డంప్ డేటాను విశ్లేషించగా, పూనమ్ దేవి, అంజన్ దాస్‌ల మొబైల్ ఫోన్‌లు అప్పటి నుండి స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయని పోలీసులు గుర్తించారు. నిందితులు అంజన్ దాస్‌ మొబైల్ సిమ్ పగలగొట్టి పారేశారు. డంప్ డేటా వివరాలను పరిశీలిస్తుండగా, పూనమ్ నంబర్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో పోలీసులు ఆరా తీస్తూ పూనమ్ ను చేరుకున్నారు. సీసీటీవీ కెమెరాల్లో ఉన్న మహిళ పూనమ్‌గా స్థానికులు గుర్తించారు.


మొదట్లో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో అంజన్ దాస్‌ బీహార్ వెళ్లాడని చెప్పారు. అంజన్ దాస్‌ను హత్య చేసిన సమయంలో నిందితుల దుస్తులు పోలీసులకు లభించడంతో.. వారు తమ నేరాన్ని అంగీకరించారు. అనంతరం ఈ ఘటన మొత్తాన్ని బయటపెట్టారు. నిందితులు చెత్తకుప్పల్లో పడి ఉన్న మృతదేహాన్ని చూసేందుకు వెళ్లేవారని, అంజన్ దాస్‌ మృతదేహం ముక్కలను తాము విసిరిన తర్వాత చూసేందుకు వెళ్లేవారని విచారణలో నిందితులు అంగీకరించినట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత మృతదేహం ముక్కలు. దీపక్, పూనమ్ దేవి మృతదేహం ముక్కలను చూసేందుకు ఒక్కొక్కరు మూడు సార్లు వెళ్లారని, అక్కడ మృతదేహం ముక్కలు కనిపించడంతో నిందితులు చెత్తతో కప్పేసేవారని తేల్చారు.


ఇక .. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అంజన్ దాస్‌ హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. అంజందాస్ ఎక్కడున్నాడంటూ ఇరుగుపొరుగువారు దీపక్, పూనమ్‌లను పలుమార్లు అడిగారు. ఈ క్రమంలో అతడు తన పిల్లలతో కలిసి ఉండేందుకు బీహార్ వెళ్లినట్లు వారు చెబుతుండేవాడు. అంజన్ దాస్‌ మొదటి భార్య, ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు బీహార్‌లో నివసిస్తున్నారు. పోలీసులు అతని కుటుంబ సభ్యులను ఇప్పుడు ఢిల్లీకి పిలిపిస్తున్నారు. పాండవ్ నగర్‌లో లభించిన మానవ శరీర ముక్కల డీఎన్‌ఏతో అతని కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో టెస్ట్ చేయనున్నారు. 


Also Read: Minerva Coffe Shop : మహేష్ ఫాన్స్ కు వరుస విషాదాల తరువాత ఒక శుభవార్త


Also Read: Ap Government: ఆ అధికారిపై ఎంత ప్రేమో...ఏకంగా కొత్త పదవిని సృష్టించిన సీఎం జగన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook