Car Hit and Run: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ధనవంతులు తమ విలాసవంతమైన కార్లతో హల్‌చల్‌ చేస్తున్నారు. గత వారమే అత్యంత వేగంగా దూసుకెళ్లి ఓ బౌన్సర్‌ను బలిగొన్న ఘటన మరువకముందే మరో చోట ఓ స్పోర్ట్స్‌ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో అన్నాచెల్లెలుతో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన ఆ కారు ఆగకుండా మరింత వేగంగా దూసుకెళ్లింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత వారమే ఓ బౌన్సర్‌ను ఢీకొట్టి హిట్‌ అండ్‌ రన్‌ ఘటన మరువకముందే మరో సంఘటన జరిగింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మరో కారు బీభత్సం సృష్టించింది. రెండు బైక్‌లను ఢీకొట్టి ఆగకుండా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో అన్నాచెల్లెలు ఉన్నారు. సరదాగా స్కూటీపై బయటకు రాగా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
 



కృష్ణానగర్‌కు చెందిన అన్నాచెల్లెలు ఉదయ్‌, స్వీటీ కలిసి సరదాగా ద్విచక్ర వాహనంపై బటయకు వచ్చారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 36కు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన తెలుగు రంగు కలిగిన స్పోర్ట్స్‌ కారు వీరిని ఢీకొట్టింది. వీరితోపాటు మరో ద్విచక్ర వాహనాన్ని ఆ కారు ఢీకొట్టింది. ఢీ కొట్టిన కారు ఆగకుండానే ముందుకు దూసుకెళ్లింది. ప్రమాదం ధాటికి ద్విచక్ర వాహనదారుడి హెల్మెట్‌ ఎగిరి కారుకు వేలాడుతూ ఉండిపోయింది.


సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కారు కోసం అన్వేషిస్తున్నారు. దీనికోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తరచూ ఈ సంఘటనలు జరుగుతుండడంతో పోలీసులు పటిష్ట నిఘా ఉంచారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నారు.

Also Read: Jharkhand New CM: జార్ఖండ్‌లో క్షణక్షణం ఉత్కంఠ.. తదుపరి కొత్త ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?

Also Read: YSRCP Ready To Election: వైసీపీ ఐదో జాబితాలో భారీ మార్పులు.. మాజీ మంత్రి అనిల్‌కు జాక్‌పాట్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి