Software Engineer strangled BDS Student for refusing love in Guntur: ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగడం లేదు. ప్రతిరోజు దేశంలోని ఏదోమూల మహిళపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతి గొంతుకోసి చంపాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రేమోన్మాది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్వి (21).. విజయవాడలోని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ (బీడీఎస్‌) మూడో సంవత్సరం చదువుతోంది. ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. వీరిద్దరికి రెండేళ్ల క్రితం ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఆ తపస్విని జ్ఞానేశ్వర్‌ వేధిస్తుండటంతో.. ఇటీవల విజయవాడ పోలీస్‌ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు జ్ఞానేశ్వర్‌ను స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. 


పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా జ్ఞానేశ్వర్‌ వేధింపుల్ని మాత్రం ఆపలేదు. దీంతో తపస్విని 10 రోజుల క్రితం తక్కెళ్లపాడులోని తన స్నేహితురాలి రూమ్‌కు వెళ్లి అక్కడే ఉంటోంది. విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర్‌.. సోమవారం (డిసెంబర్ 5) రాత్రి సర్జికల్‌ బ్లేడు, కత్తి వెంట తీసుకుని యువతి ఉంటున్న ప్రాంతానికి వెళ్లాడు. మాట్లాడుదాం అని పిలిచిన జ్ఞానేశ్వర్‌ సర్జికల్‌ బ్లేడుతో యువతి గొంతు కోశాడు. ఆపై తన చేతిని కూడా కోసుకున్నాడు. దీంతో తపస్విని స్నేహితురాలు పెద్దగా అరవడంతో స్థానికులు అక్కడికి వచ్చి జ్ఞానేశ్వర్‌కు దేహశుద్ధి చేశారు. ఆపై తాడుతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.


తపస్విని చికిత్స నిమిత్తం స్థానికులు మొదట ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తపస్వి పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది. దాంతో యువతి కుటుంబీకులు బోరున ఏడ్చేశారు. జ్ఞానేశ్వర్‌పై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్‌.. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. 


Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు!


Also Read: Hyderabad Cold Updates: ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. హైద‌రాబాద్‌ను వణికిస్తున్న చలి!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.