Assam BJP Leader Indrani Tahbildar Death News: అస్సాం రాష్టానికి చెందిన ఓ బీజేపీ నాయకురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో సీనియర్ పార్టీ నాయకుడితో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గౌహతిలోని బామునిమైదాం ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని రాష్ట్ర బీజేపీ నాయకురాలు ఇంద్రాణి తహబీల్దార్‌గా గుర్తించారు. ఆమె ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం కిసాన్ మోర్చా కోశాధికారిగా కూడా ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తహబీల్దార్ తన ఇంట్లో అద్దెకు ఉండే మరో బీజేపీ సీనియర్ నాయకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ జంట కొన్ని ప్రైవేట్ పిక్స్ ఇటీవల ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆగస్టు 11న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో డ్రగ్ ఓవర్ డోస్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మహిళా నేత ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర బీజేపీలో కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


సెంట్రల్ గౌహతి డీసీపీ దీపక్ చౌదరి మాట్లాడుతూ.. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు. విచారణ కొనసాగుతందని చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు మృతురాలు మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోల లీక్‌పై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. కానీ బీజేపీ నాయకురాలి ఆత్మహత్య కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని తెలిపారు. తహబీల్దార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గౌహతి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.


Also Read: Bhola Shankar Collections: భోళా శంకర్ మూవీకి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. అస్సలు ఊహించలేరు..!  


Also Read: RBI Penalty On Banks: ఈ నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఇందులో మీకు అకౌంట్ ఉందా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి