Pre Wedding Party: స్టార్‌ హోటల్‌లో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్‌ పార్టీ తీవ్ర విషాదంగా మారింది. పార్టీలో స్నేహితుల మధ్య జరిగిన వివాదంలో తండ్రి కల్పించుకున్నారు. వెంటనే వచ్చి కుమారుడి స్నేహితులతో గొడవకు దిగి భవనంపై నుంచి ఓ యువకుడిని తోసేశారు. అంకుల్‌ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి పెద్ద బిజినెస్‌మేన్‌ అని తెలిసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Cyber Crime: సైబర్‌ నేరగాళ్లకు మరో ప్రాణం బలి.. 19 ఏళ్లకే నిండిన నూరేళ్లు


 


బరేలీకి చెందిన ఓ యువకుడికి వివాహం నిశ్చయమైంది. పెళ్లి కుదిరిన సందర్భంగా తన స్నేహితులకు బ్యాచిలర్‌ పార్టీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ప్రముఖ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో పార్టీకి తన స్నేహితులను పిలిచాడు. అందరూ ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం మొదలైంది. ఆ వివాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. దీంతో ఓ యువకుడు తన తండ్రికి ఫోన్‌ చేసి పిలిపించాడు. హోటల్‌కు వచ్చిన తండ్రి తన కుమారుడిని దూషించిన యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. కొట్లాడుతూనే టెర్రస్‌పై నుంచి కిందకు తోసేశాడు. అనంతరం మరో యువకుడిపై పలుమార్లు చెంపచెల్లుమనిపించాడు. విచక్షణరాహితంగా దాడికి పాల్పడ్డాడు.

Also Read: Telugu Girls Arrest: అమెరికాలో పరువు తీసిన తెలుగు అమ్మాయిలు.. దొంగతనం చేసి జైలుపాలు


 


అడ్డుకున్న మరో యువకుడిని కిందపడేసేందుకు ప్రయత్నించగా.. ఇతర స్నేహితులు, హోటల్‌ సిబ్బంది అడ్డుకున్నారు. కిందపడిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే హోటల్‌ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు  కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే ఫోన్‌ కాల్‌తో వచ్చిన వ్యక్తి ఒక వ్యాపారవేత్తగా తెలిసింది. అయితే ఈ గొడవంతా మద్యం మత్తులో ఉండగా జరిగింది. మద్యంమత్తులో స్నేహితుల మధ్య ఓ విషయమై ఘర్షణ తలెత్తిందని పోలీసులు తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter