Wife Swapping Case: సమాజంలో రానురానూ పనికిమాలిన చేష్టలు పెరిగిపోతున్నాయి. పాశ్చాత్త సంస్కృతిలో కూడా పెద్దగా కన్పించని వైఫ్ స్వాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చెన్నైలో పోలీసుల దాడిలో బయటపడిన సెక్స్ రాకెట్‌లో నిర్ఘాంతపోయే నిజాలు వెల్లడయ్యాయి. 8 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు చెన్నైలో వైఫ్ స్వాపింగ్ ముసుగులో సెక్స్ రాకెట్ నడుపుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా భార్యల్ని మార్చుకునే వెకిలి చేష్టలు చెన్నైలో వెలుగుచూడటంతో కలకలం రేగుతోంది. కోయంబత్తూర్, మధురై, సేలం, ఈరోడ్ ప్రాంతాలతో పాటు చెన్నైలో గత 8 ఏళ్లుగా వైఫ్ స్వాపింగ్ పార్టీలు జరుగుతుండటం గమనార్హం. 


భార్యల్ని మార్చుకునే పార్టీ కోసం ఈ ముఠా సోషల్ మీడియాలో ఓ పేజ్ కూడా క్రియేట్ చేసింది. భార్యల మార్పిడికి కస్టమర్ల నుంచి 13 వేల నుంచి 25 వేల వరకూ వసూలు చేసేవారు. ముందు ఇతరుల భార్యలతో సంబంధం పెట్టుకోవాలనుకునే పురుషుల్ని టార్గెట్ చేసి..కొంతమంది మహిళల్ని తమ భార్యలుగా చూపించే ముఠా ఇది. పోలీసులు దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో 30-40 ఏళ్ల మద్యలో ఉన్న మహిళల్ని యాంటీ విస్ స్క్వాడ్ అధికారులు రక్షించారు. ఈ మహిళలంతా వివాహితులే కావడం గమననార్హం. 


వాస్తవానికి ఈ ఘటనపై ఇరుగుపొరుగు నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా వైఫ్ స్వాపింగ్ సెక్స్ రాకెట్ వెలుగు చూసింది. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో సెంథిల్ కుమార్, కుమార్, చంద్రమోన్, శంకర్, వెల్రాజ్, పేరరాసన్, సెల్వన్, వెంకటేశ్ కుమార్ ఉన్నారు. 


Also read: Supreme Court: చట్టసభ సభ్యుల కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, హైకోర్టుకు అన్ని అధికారాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook