Tamil Nadu Rape Case: బాయ్‌ఫ్రెండ్‌ను కట్టేసి.. చీకట్లో యువతిపై గ్యాంగ్ రేప్
College Student Gangraped: ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సరదాగా బయటకు వెళ్లింది. అలా వెళ్లడమే ఆమె పాలిట శాపంగా మారింది. ఆరుగురు నరరూప రాక్షసులు ఆమెపై అత్యాచారానికి ఒడిగడ్డారు. బాయ్‌ఫ్రెండ్‌పై దాడి చేసి.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు ఇలా..
College Student Gangraped: తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కత్తితో బెదిరించి 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రియుడి ఎదుటే దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బెంగళూరు-పుదుచ్చేరి హైవే సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఈ సంఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాలు ఇలా..
కాంచీపురానికి కళాశాల విద్యార్థిని గురువారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ప్రియుడితో కలిసి సరదాగా బయటకు వెళ్లింది. నిర్మానుష్య ప్రదేశానికి ఇద్దరుపై బైక్‌పై వెళ్లారు. వారిని గమనించి ఇద్దరు వ్యక్తులు.. మాస్కులు ధరించి దగ్గరకు వచ్చారు. ఫుల్‌గా మద్యం తాగి వచ్చిన వారు.. ముందుగా యువకుడిపై దాడి చేశారు. వాళ్లకు మరో నలుగురు తోడు అవ్వగా.. అందరూ కలిసి బాయ్‌ఫ్రెండ్‌ను కట్టేశారు. యువతి సహకరించకుంటే చంపి పాతిపెడతామని దుండగులు బెదిరించారు. ఆమెను చీకట్లోకి తీసుకువెళ్లి ఒకరి తరువాత ఒకరు యువతి అత్యాచారానికి పాల్పడ్డారు.
అనంతరం వారిద్దరిని అక్కడే వదిలేసి.. దుండగులు పరార్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. యువతిని ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తిగా చీకటిగా ఉండడం, వెలుతురు లేకపోవడంతో బాధితురాలు ఎవరినీ గుర్తించలేకపోయింది. అయితే ఒక నిందితుడిని విమల్ అని పిలవడం తనకు వినిపించిందని ఆమె పోలీసులకు తెలిపింది.
దీని ఆధారంగా పోలీసులు విపాడు గ్రామానికి చెందిన విమల్‌ను పట్టుకునేందుకు వెళ్లగా ..తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అతడిని చుట్టుముట్టు అరెస్ట్ చేయగా.. మరో నలుగురు మణికందన్, శివకుమార్, విఘ్నేష్, తెన్నరసులను పట్టుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురిపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Also Read: Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. చంపేస్తామంటూ..
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త.. జీతాల పెంపు ఎప్పుడంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి