5 Years Old Boy found as dead in Air Cooler: మనుషులు అత్యంత క్రూరంగా మారుతున్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న కోపంతో అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మానవత్వం మంట కలిసిందా.. అనిపించేంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో జరుగుతున్న నేరాలను పరిశీలిస్తే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది. ఇటీవల మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన దారుణ సంఘటన సభ్య సమాజం షాక్ అయ్యేలా ఉంది అనడంలో సందేహం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్యూషన్ కోసం అని వెళ్లిన అయిదు సంవత్సరాల బాలుడు పక్క ఇంట్లోని ఒక కూలర్‌ లో శవం అయ్యి కుక్కబడి ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో బాలుడి శవంను చూసి తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. బాలుడిని చంపి కూలర్ లో మృతదేహం పెట్టింది ఎవరు అనేది ప్రస్తుతం విచారణ జరుగుతోంది. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని మాచంద్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఐదేళ్ల బాలుడు ప్రతి రోజు మాదిరిగానే ట్యూషన్ కు వెళ్లాడు. తల్లిదండ్రులు పిల్లాడు ట్యూషన్‌ కు వెళ్లాడు కదా అని అతడి గురించి పట్టించుకోలేదు. మరో వైపు ట్యూషన్ కు ప్రతి రోజు వచ్చే కుర్రాడు హాజరు కాకపోవడంతో ఇంట్లో వారు ఏమైనా ఉంచారేమో అనుకున్నారు. ట్యూషన్ సమయం ముగిసిన తర్వాత కూడా పిల్లాడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ట్యూషన్ పాయింట్ కు వెళ్లి ఎంక్వైరీ చేశారు.


Also Read: Ukrainian: ఉక్రెయిన్ గగన తలంపై ఫ్లాష్‌ లైట్‌ రష్యా పని అనుకుని ఆందోళన.. చివరకు అంతా రిలాక్స్‌


ట్యూషన్ కు పిల్లాడు రాలేదని ట్యూషన్ టీచర్‌ చెప్పడంతో షాక్ అయిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. ఇంట్లో మరియు చుట్టుపక్కల వెదికారు. చిన్నారితో ఆడుకున్న పిల్లలను మరియు చుట్టు పక్కల వారిని విచారించడం మొదలు పెట్టారు. అంతలో ఒక ఇంట్లోని కూలర్ లో పిల్లాడి శవం కనిపించింది. 


ఆ కూలర్‌ ఏ ఇంట్లో ఉందో వారిని ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఇంటి వారి పని అయ్యి ఉంటుందా లేదంటే మరెవ్వరైనా చంపి ఆ ఇంట్లోని కూలర్‌ లో కుక్కి ఉంటారా అని పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. పోలీసులు పిల్లాడి శవంను స్వాదీనం చేసుకుని పోస్ట్‌ మార్టం నిర్వహించి తద్వారా దర్యాప్తు చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి దారుణమైన సంఘటనలు పిల్లల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎంతగా కఠిన శిక్షలు విధిస్తున్నా కొందరు ఇలాంటి పనులకు పాల్పడుతూనే ఉన్నారు.


Also Read: TS Eamcet 2023: తెలంగాణ ఎంసెట్‌లో కీలక నిర్ణయం, ఇకపై నో వెయిటేజ్ మార్క్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.