Delhi Murder: ఢిల్లీలో మరో దారుణం.. తండ్రి, అక్కాచెల్లెళ్లు, బామ్మను హత్య చేసిన యువకుడు
Delhi Palam Murder case: డ్రగ్స్ బానిసైన ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తన కుటుంబంలోని నలుగురిని దారుణంగా హత్య చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
Delhi Palam Murder Case: ఢిల్లీలో వరుసగా దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధా హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతుండగానే.. పాలం ప్రాంతంలో తన కుటుంబంలో నలుగురిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. డ్రగ్స్‌కు బానిసైన యువకుడు తన తండ్రి, అమ్మమ్మ, ఇద్దరు అక్కాచెల్లెళ్లను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి.. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.
ఈ దారుణ ఘటన ఢిల్లీలోని వాయువ్య ప్రాంతంలోని పాలం ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. నిందితుడు డ్రగ్స్‌కు బానిసై బంధుత్వాలను మరిచి హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు ఇద్దరు సోదరీమణులు, తండ్రి, అమ్మమ్మల మృతదేహాలు రక్తంలో తడిసి పడి ఉన్నాయి. ఓ మహిళ మృతదేహం నేలపై పడి ఉండగా.. ఇద్దరి మృతదేహాలు బాత్‌రూమ్‌లో లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మంగళవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటనపై తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు. హత్యకు గల కారణాలను నిందితుడి నుంచి పోలీసులు తెలుసుకుంటున్నారు. కేశవ్ అనే నిందితుడు డ్రగ్స్ బానిస అని వారు తెలిపారు. డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ నుంచి ఇటీవలే విడుదలైనట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇటీవల అక్టోబర్‌లో ఈశాన్య ఢిల్లీలోని సుందర్ నగ్రిలో 25 ఏళ్ల యువకుడిని ముగ్గురు వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. అక్టోబర్ 1న ఈ ఘటన జరగ్గా.. బాధితుడిని మనీష్‌గా గుర్తించారు. అనంతరం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేకిత్తిస్తోన్న శ్రద్ధా హత్య ఘటన కూడా ఢిల్లీలోనే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.
Also Read: కోహ్లీకి ఇష్టమైన ప్లేస్‌పై కన్నేసిన సూర్యకుమార్ యాదవ్.. కుమ్మేస్తున్నాడుగా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి