Delhi Girl Accident: ఢిల్లీలో దారుణ ఘటన.. యువతిని ఈడ్చుకెళ్లిన కారు.. నగ్నంగా మృతదేహం లభ్యం
Delhi Girl Died in Accident: ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్య మత్తులో యువతిని కారు చక్రాల కింద ఈడ్చుకెళ్లారు నిందితులు. దీంతో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Delhi Girl Died in Accident: కొత్త సంవత్సరం తొలి రోజు తెల్లవారుజామునే ఢిల్లీలో హృదయ విదారక ఘటన కంఝవాలాలో వెలుగు చూసింది. కొసుల్తాన్‌పురి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. యువతిని కారు చక్రాల మధ్య 8 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయింది. ఘటనకు బాధ్యులైన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలు ఇలా..
ఆదివారం తెల్లవారుజామున 3.24 గంటలకు కుతుబ్‌గఢ్ వైపు వెళ్తున్న కారుకు మృతదేహం వేలాడుతున్నట్లు ఔటర్ ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం వాహనం కోసం వెతకడం ప్రారంభించారు. 4.11 గంటలకు వాహనాన్ని గుర్తించారు. ఇంతలో మరో వ్యక్తి ఫోన్ చేసి ఒక యువతి కంఝవాలా ప్రాంతంలో రోడ్డుపై ఓ బాలిక మృతదేహం నగ్నంగా పడి ఉన్నట్లు పోలీసులకు చెప్పాడు. ఘటనా స్థలికి చేరుకున్న క్రైమ్ టీమ్‌ను పిలిపించి ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితులను దీపక్ ఖన్నా, అమిత్ ఖన్నా, కృష్ణ, మిథున్, మనోజ్ మిట్టల్‌లుగా గుర్తించారు.
అదే సమయంలో ప్రమాదానికి గురైన స్కూటీని కూడా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత స్కూటీపై వెళ్తున్న యువతి కారు చక్రాల మధ్య ఇరుక్కుపోయి చాలా దూరం ఈడ్చుకెళ్లినట్లు తేలింది. ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అందులో మృతదేహం నగ్న స్థితిలో కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పోలీసులు దీనిని ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా పేర్కొంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బాలికను కారు ఈడ్చుకెళ్లి చాలా దూరం వెళ్లిందని.. దీంతో ఆమె బట్టలు చిరిగిపోయాయని విచారణలో తేలింది.
ముర్తాల్ సోనిపట్ నుంచి మంగోల్‌పురిలోని తమ ఇంటికి తిరిగి వస్తున్న నిందితులు.. సుల్తాన్‌పురి సమీపంలో యువతి స్కూటీ ఢీకొట్టారు. అయితే మద్యం మత్తులో ఉన్న యువకులు కారును అలానే పోనిచ్చారు. యువతి కారు కింద చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో వెల్‌కమ్ గర్ల్‌గా పనిచేసే యువతిగా గుర్తించారు. పని నుంచి అర్ధరాత్రి ఇంటికి తిరిగి వస్తున్నట్లు సమాచారం. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది.
Also Read: Sandeep Singh: హర్యానా స్పోర్ట్స్ మినిస్టర్ సందీప్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు.. పదవికి రాజీనామా
Also Read: Nashik Factory Fire: నాసిక్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 14 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook