Kanjhawala Case: ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో డ్రగ్స్ కోణం.. తెలంగాణ నుంచి తీసుకెళ్లారా?
Drugs Angle in Kanjhawala Case: ఢిల్లీలోని కంఝవాలాలో దారుణ రీతిలో ప్రమాదానికి గురైన అంజలి మృతి కేసుకు సంబంధించి చేస్తున్న విచారణలో ఒక డ్రగ్స్ కేసు తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు
Drugs Angle in Kanjhawala Case: ఢిల్లీలోని కంఝవాలాలో దారుణ రీతిలో ప్రమాదానికి గురైన అంజలి మృతికి సంబంధించి పోలీసులు ఆమె స్నేహితురాలు నిధిని విచారించారు. ఈ విచారణ సందర్భంగా పోలీసులు సంఘటన జరిగిన రాత్రికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే రాబట్టారు. దీంతో పాటు ఆమె మీద మీడియాలో వస్తున్న వార్తలపై కూడా పోలీసులు ఆమెను ఆరా తీశారని తెలుస్తోంది. అంజలి స్నేహితురాలు నిధి మీద ఆగ్రాలో నమోదైన కేసుపై కూడా ప్రశ్నలు సంధించారని అయితే నిధి మాత్రం అంజలి ఘటనకు సంబంధించి మాత్రమే పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఆమె ఇతర ప్రశ్నలన్నీ దాటవేసిందని అంటున్నారు. ఇక ఈ విచారణలో, రాత్రి ఏ సమయంలో అంజలితో కలిసి హోటల్‌కు వచ్చాను? హోటల్‌లో తమ మధ్య ఎందుకు గొడవ జరిగింది? అనే వివరాలు కూడా పోలీసులకు నిధి చెప్పింది. అలాగే అంజలితో కలిసి స్కూటీలో ఇంటికి వెళ్లేందుకు అర్థరాత్రి అక్కడి నుంచి బయలుదేరినట్లు నిధి చెప్పిందని, అయితే ఈ క్రమంలో అంజలి మద్యం మత్తులో ఉండడంతో స్కూటీని నేను నడుపుతానని అంటే అంజలి స్కూటీని నడపనివ్వలేదని నిధి చెప్పుకొచ్చింది. అయితే డ్రగ్స్ కేసులో నిధి ప్రస్తుతం బెయిలుపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు, ప్రమాద సమయంలో స్కూటీపై అంజలితో ప్రయాణిస్తున్న నిధి.. 2020 డిసెంబర్ లో తెలంగాణ నుంచి ఢిల్లీకి 30 కేజీల గంజాయి రవాణా చేస్తూ ఆగ్రా రైల్వే స్టేషనులో పట్టుబడగా, ఆమె మీద డ్రగ్స్ కేసు కూడా నమోదయినట్టు పోలీసులు గుర్తించారు.
అయితేఘటన జరిగిన రోజు రాత్రి అంజలి మద్యం తాగినట్లు నిధి చెబుతున్నా పోస్టుమార్టంలో ఆమె శరీరంలో మద్యం ఆనవాళ్లు లేవని అంజలి ఫ్యామిలీ న్యాయవాది చెబుతున్నారు. మరోపక్క సుల్తాన్‌పురి ప్రాంతంలో నిధి లక్షల రూపాయలతో ఇల్లు కొనుగోలు చేసిందని కూడా పోలీసులు గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని నెలల క్రితం రూ.16 లక్షలతో ఆమె ఒక ఇంటిని కొనుగోలు చేసిందని అంటున్నారు. ఆమె ఈ ఇంట్లో ఒంటరిగా నివసించేదని రెండు అంతస్తులు మాత్రం అద్దెకు ఇచ్చిందని అంటున్నారు.
అలాగే నిధి ఇటీవలే ఓ స్కూటీ కూడా కొన్నదని ఆమె ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. అయితే అసలు ఏ పని చేస్తుంది అనే విషయం మాత్రం ఆమె ఇరుగుపొరుగు వారికి తెలియదని అంటున్నారు. ఇళ్ళలో పాచిపని చేసే ఒక మహిళ కుమార్తె అయిన నిధి ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారో? అని కూడా అక్కడి స్థానికులు చర్చించుకునేవారని అంటున్నారు.
ఆమె ఇల్లు కొనుక్కున్నాక కూడా ఇంటికి అద్దెకు ఇవ్వడానికి ఇష్టపడలేదు కానీ ఇల్లు అద్దెకు కావాలి అంటూ ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉండడంతో 15 రోజుల తర్వాత ఇంట్లోని రెండు అంతస్తులు అద్దెకు ఇచ్చిందని తెలుస్తోంది. ఇక ఇంట్లో అద్దెకున్నవారు నిధితో మాట్లాడాలనుకున్నా ఆమె ఎవరితోనూ మాట్లాడేది కాదట. మొత్తం మీద నిధి వ్యవహారం అంతా అనుమానాస్పదంగానే ఉండడంతో ఆమె మీద కూడా ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
Also Read: Waltair Veerayya Theatrical Trailer: పూనకాలు లోడింగ్.. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్.. ట్రైలర్ చూశారా?
Also Read: Shock to Waltair Veerayya: మరో సారి వాల్తేరు వీరయ్య యూనిట్ కు షాక్.. ఈసారి ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook