Drugs Supplying to Students: విద్యార్థులే టార్గెట్‌గా కోట్ల రూపాయల డ్రగ్స్ సరఫరా చేస్తోన్న ముఠా అరెస్ట్
Drugs Supply Plot Busted by Hyderabad Cops: హైదరాబాద్ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోందా ? వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా చెలరేగిపోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. నిషేధిత డ్రగ్స్‌ని అక్రమ రవాణా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అంతకు మించిన రేంజులోనే ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు డ్రగ్స్ దందాగాళ్లు.
Drugs Supply Plot Busted by Hyderabad Cops: అడుగడుగునా నిఘా నేత్రాలు. పోలీసుల గట్టి నిఘా. నిషేధిత డ్రగ్స్ అమ్మితే కఠిన చర్యలు తప్పవని తెలిసినా.. అక్రమమార్గాల్లో డ్రగ్స్ సరఫరా ఆగడం లేదు. డ్రగ్స్ దందాగాళ్లపై పీడీ యాక్ట్ నమోదవుతున్నప్పటికీ హైదరాబాద్ ని డ్రగ్స్ కు కేరాఫ్ అడ్డగా మార్చేస్తున్నారు కేటుగాళ్లు. ఒత్తిడి తట్టుకునేందుకు కొందరు.. సరదా కోసం మరికొందరు.. ఇలా తమకు తెలియకుండానే డ్రగ్స్ నెట్‌వర్క్‌లో చిక్కుకుంటున్నారు. అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ సరఫరా చేస్తోన్న కేటుగాళ్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు వాళ్ల నుంచి కోటీ 33 లక్షల విలువ చేసే డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పూర్తి డీటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. లుక్
హైదరాబాద్ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోందా ? వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా చెలరేగిపోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. నిషేధిత డ్రగ్స్‌ని అక్రమ రవాణా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అంతకు మించిన రేంజులోనే ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు డ్రగ్స్ దందాగాళ్లు. మనం సినిమాలో చూసినప్పుడు వామ్మో ఇలా కూడా అక్రమ రవాణా చేస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నిజ జీవితంలో మాత్రం సినిమాలు కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే డ్రగ్స్ రవాణా చేయడానికి సరికొత్త దారులను వెతుకుతూ ఉన్నారు డ్రగ్స్ ముఠా. టెక్నాలజీని బీభత్సంగా వాడేస్తున్నారు. అందులో వాట్సాప్‌ని ప్రధానంగా వాడుతున్నారు. కొకైన్ అమ్మకాలు జోరుగా కొనసాగిస్తూ సైబరాబాద్ కమిషరేట్ పోలీసులకు ఐదుగురు నిందితులు చిక్కారు. కోటి 33లక్షల విలువైన 303 గ్రాముల కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు.
ఏ1 నిందితుడైన రాకేష్ రోషన్ గతంలో డ్రై ప్రూట్స్ బిజీనేస్ చేసేవాడు. వ్యాపారంలో చాలా నష్టాలు వచ్చాయి. అదే టైంలో గోవాలోని ఓ పార్టీకి రాకేష్ వెళ్లాడు. అక్కడ రాకేష్ కొకైన్ రుచి చూశాడు. గోవాలో పరిచయమైన ఏ2 నిందితుడు పెట్టి గాబ్లియర్ అనే వ్యక్తి నుంచి ఒక గ్రామ్ కోకైన్‌ను 7వేలకు రాకేష్ కొనుగోలు చేసేవాడు. అక్కడి నుంచి సరుకును హైదరాబాద్ కు తీసుకొచ్చి అమ్మకాలు జరిపేవాడు. ఒక్క గ్రామ్ 15 వేల నుంచి 18 వేల మధ్యలో అమ్మకాలు జరిపేవాడు. ఏపీ రాష్ర్టం నెల్లూరు జిల్లాకు చెందిన ఏ3 నిందితుడు గజ్జల శ్రీనివాస్ రెడ్డి బిజనెస్‌లో నష్టాలు రావడంతో ఇతను కూడా ఈజీ మనీ వైపు మొగ్గు చూపాడు. నిరుద్యోగిగా ఉన్న ఏ4 నిందితుడైన సూర్య ప్రకాశ్ కూడా సింపుల్ గా మనీ సంపాధించాలని ఆశ పడ్డాడు. ఏ3 నిందితుడు గజ్జల శ్రీనివాస్ రెడ్డి, ఏ4 నిందితుడైన సూర్య ప్రకాశ్ ఇద్దరు కలిసి నైజీరియన్ కు చెందిన ఏ5 నిందితుడైన చుక్వు విక్టర్ నిందితుడి నుంచి కోకైన్ ను కొనుగోలు చేసేవారు.
[[{"fid":"272174","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Drugs-Smuggling-busted-by-Cyberabad-Police.jpg","field_file_image_title_text[und][0][value]":"Drugs Supplying to Students: విద్యార్థులే టార్గెట్‌గా కోట్ల రూపాయల డ్రగ్స్ సరఫరా చేస్తోన్న ముఠా అరెస్ట్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Drugs-Smuggling-busted-by-Cyberabad-Police.jpg","field_file_image_title_text[und][0][value]":"Drugs Supplying to Students: విద్యార్థులే టార్గెట్‌గా కోట్ల రూపాయల డ్రగ్స్ సరఫరా చేస్తోన్న ముఠా అరెస్ట్"}},"link_text":false,"attributes":{"alt":"Drugs-Smuggling-busted-by-Cyberabad-Police.jpg","title":"Drugs Supplying to Students: విద్యార్థులే టార్గెట్‌గా కోట్ల రూపాయల డ్రగ్స్ సరఫరా చేస్తోన్న ముఠా అరెస్ట్","class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇది కూడా చదవండి : Cyber Criminal Real Story: వీడు మామూలోడు కాదు.. రోజుకు రూ 5 కోట్ల నుంచి 10 కోట్లు కాజేశాడు
ఇలా ఈ ఐదుగురు నిందితులు కలిసి గోవాలో కొకైన్ కొనుక్కొచ్చి హైదరాబాద్‌లో అమ్మకాలు జరిపేందుకు ప్లానింగ్ చేశారు. విద్యార్ధులతో పాటు ప్రతిఒక్కరిని కూడా ఈ మత్తులో దించి వారిని తమ రెగ్యులర్ కస్టమర్స్‌గా మల్చుకునేందుకు స్కెచ్ వేశారు. జోరుగా అమ్మాకాలు కొనసాగించేందుకు రంగంలో దిగిన ఐదుగురిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక నిందితుడైన ఏ2 నిందితుడు పెట్టి గాబ్లియర్ పరారీలో ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 303 గ్రాముల కొకైన్, 5 మొబైల్ ఫోన్లు, 2 ఫోర్ వీలర్ వాహనాలు. ఒక వెయింగ్ మిషన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నిందితులపైనే ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు... నిందితుల కాంటాక్ట్ లిస్టులో చాలా మంది కస్టమర్స్ ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వారందరని విచారించేందు సైబరాబాద్ పోలీసులు రెడీ అవుతున్నారు.
ఇది కూడా చదవండి : Beautiful Girls For Enjoyment: స్నేహం, సరదాల కోసం అందమైన అమ్మాయిలు.. 71 ఏళ్ల వృద్ధుడికి లక్షల్లో టోకరా
ఇది కూడా చదవండి : Maoist Recruitment in Telangana: తెలంగాణలో మళ్లీ మావోయిస్టు రిక్రూట్మెంట్ జరుగుతోందా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK