Father-In-Law wanted to sleep with newly wed Daughter-in-law: మంచి అనే బాట నుంచి పక్కకు తప్పితే మనిషి బుద్ధి చాలా అచంచలమైనది.. మంచి ఏది, చెడు ఏది అనేది తెలియకుండా చేస్తుంది. కామంతో కళ్లు మూసుకుపోయేలా చేస్తుంది. చివరకు అదే బుద్ధి వారిని అంతమొందిస్తుంది. ఇక్కడ ఓ మానవ మృగం విషయంలో అలానే జరిగింది. కన్న బిడ్డలా చూసుకోవాల్సిన కొత్త కొడలిపై కన్నేసిన ఓ దుర్మార్గుడు.. ఆమెతో పడక సుఖం పంచుకోవాలని ఆశపడ్డాడు. ఆశ మంచిదైతే పంఛ బూతాలు ఏకమై వారి ఆశను నిజం చేసుకునే శక్తినిస్తాయి.. అదే ఆశ చెడ్డదైతే అవే పంచభూతాలు ఏకమై పాతిపెడతాయి. ఈ దుర్మార్గుడి విషయంలోనూ అదే జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త కోడలిపై కన్నేసిన ఆ దుర్మార్గుడు.. ఆమెతో పడక సుఖం కోసం ఉవ్విళ్లూరాడు. అందుకోసం ఏకంగా తన భార్యనే ఆయుధంగా మార్చి మధ్యవర్తిగా ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. కట్టుకున్న పాపానికి ఏం కోరినా చేసి పెడుతుంది అని భ్రమపడ్డాడు. కానీ ఉన్నట్టుండి ఓ అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో తన ఇంటి ఆవరణలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతడి గొంతు కోసి హత్య చేశారు. ఇంతకీ ఏం జరిగింది ? అతడిని చంపింది ఎవరు ? తన భార్యపై కన్నేసినందుకు కన్న కొడుకే మర్డర్ చేసి పారేశాడా ? తన జీవితాన్ని పాడు చేయాలనుకున్నందుకు కోడలే అతడికి తగిన శిక్ష విధించిందా ? లేక తన భర్త నుండి అభం శుభం తెలియని అమాయకురాలైన కోడలిని కాపాడుకునేందుకు అత్తే అపర కాళీ  అవతారమెత్తిందా ? అసలు వీటితో సంబంధం లేకుండా ఇంకెవరైనా బయటి వాళ్లు ఈ పని చేసారా ? ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది ? సవాలక్ష యక్ష ప్రశ్నలకు తావిచ్చిన ఈ రియల్ క్రైమ్ స్టోరీ ఇన్వెస్టిగేషన్ ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి.


ఉత్తర్ ప్రదేశ్ లోని బుదౌన్ లో జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన అసలు వాస్తవాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 14న రాత్రి వేళ 43 ఏళ్ల తేజేంద్ర సింగ్ తన ఇంటి ఆవరణలోనే పడుకుని నిద్రపోతూ హత్యకు గురయ్యాడు. ఆటబొమ్మల తయారీ వ్యాపారంలో ఉన్న అతడి మర్డర్ స్థానిక పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. ఇంటితో సంబంధం లేని బయటి వ్యక్తులే చంపి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అతడి భార్య మితిలేష్ దేవి చెబుతున్న పొంతన లేని సమాధానాలు ఆమెపై అనుమానం బలపడేలా చేశాయి. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. సభ్య సమాజం తలదించుకునే వాస్తవం వెలుగులోకొచ్చింది.


బుదౌన్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ బిల్సీ బ్రజేష్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తన భర్తను తానే హత్య చేశానని చెప్పిన మితిలేష్ దేవి.. అతడి బారి నుండి తన కోడలిని కాపాడుకునేందుకే ఈ హత్య చేశానని చెప్పింది. కోడలిపై కన్నేసిన తన భర్త.. ఆమెతో పడక సుఖం కోసం అర్రులు చాచాడని... కోడలిని ఒప్పించాల్సిందిగా తనపైనే ఒత్తిడి తీసుకొచ్చాడని చెప్పి బోరుమంది. ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుంది అని భావించిన తాను.. తన భర్త నుండి కోడలిని రక్షించడం కోసం సరైన సమయం కోసం వేచిచూస్తున్న తరుణంలోనే ఆగస్టు 14న రాత్రి తనకు ఆ అవకాశం వచ్చినట్టు వెల్లడించింది. 


ఇది కూడా చదవండి : An Other Agrigold Scam: అధిక వడ్డీ ఆశ చూపించి.. రూ. 1500 కోట్లకు కుచ్చుటోపి


ఆ రోజు రాత్రి ఫూటుగా మద్యం తాగి సోయి లేకుండా ఇంటికొచ్చిన భర్తను చూశానని.. అదే అదనుగా భావించి ఆ రాత్రే ఆరుబయట నిద్రపోతున్న అతడి గొంతుకోసి హత్య చేశానని పోలీసుల విచారణలో అంగీకరించింది. నలుగురు పిల్లలకు తల్లి అయిన ఆ మాతృ మూర్తి ఆ విషయం చెప్పనంత వరకు అతడి పాడు బుద్ది బయటికి రాలేదు. ఆమె చెప్పిన విషయం విని అందరూ షాకయ్యారు. కోడలిని వేధింపులకు గురిచేసి వారికి ప్రత్యక్ష నరకం చూపించిన పిశాచాలు ఉన్న చోటే.. కోడలి జీవితం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన మాతృమూర్తులు కూడా ఉన్నారని మితిలేష్ దేవి నిరూపించింది. ఇక చేసేదేం లేక, బయటికి చెప్పి పరువు పోగొట్టుకోలేక చట్టాన్ని చేతుల్లోకి తీసుకోక తప్పలేదని ఆమె చెప్పిన మాటలు విన్న వారికి ఆమెలో ఒక తల్లే కనిపించింది కానీ అత్త పాత్ర గానీ లేదా హంతకురాలి పాత్ర గానీ కనిపించలేదు. మితిలేష్ దేవి రియల్ క్రైమ్ స్టోరీ విన్నాకా.. ఆమె పేరుకు తగినట్టుగానే దేవి అని అనుకున్నారంతా.


ఇది కూడా చదవండి : Constable Murder Case: భార్య చేతిలో కానిస్టేబుల్ దారుణ హత్య.. ప్రాణం తీసిన అక్రమ సంబంధం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook