Betting Murder: బెట్టింగ్ ఖరీదు ఒక ప్రాణం.. రూ.2 కోట్లు.. ఆస్తిపాస్తులు అమ్మేసిన కొడుకు హత్య
Father Killed Betting Addicted Son In Medak District: బెట్టింగ్ ఆ కుటుంబంలో చిచ్చురేపింది.. ఆస్తిపాస్తులను తాకట్టు పెట్టించింది. చివరకు ఆ బెట్టింగ్ ఒక ప్రాణం తీసింది. బెట్టింగ్ కారణంగా ఓ తండ్రి తన కొడుకును దారుణంగా హత్యకు పాల్పడ్డాడు.
Betting Murder: ఏ రూపంలో చూసినా బెట్టింగ్ అనేది మహమ్మారి. ఒకసారి అలవాటు అయితే వదులుకోలేం. దానికోసం ఆస్తిపాస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అలా బెట్టింగ్‌కు అలవాటుపడిన ఓ రైల్వే ఉద్యోగి బానిసగా మారాడు. వేలు, లక్షలు కాదు కోట్లలో బెట్టింగ్ చేయడంతో కుటుంబం దివాళా తీసింది. అప్పులన్నీ చుట్టుముట్టడం.. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో తన కుమారుడిని కన్న తండ్రిని అత్యంత దారుణంగా హతమార్చిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఈ సంఘటన దేశం మొత్తం నివ్వెరపరిచింది.
Also Read: Mothers Day: మదర్స్ డే రోజే తీరని విషాదం.. 'అమ్మా' అంటూ తల్లీని కాపాడబోయి కొడుకు మృతి
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లికి చెందిన ముకేశ్ కుమార్ (28) రైల్వే ఉద్యోగిగా పని చేస్తుండేవాడు. కౌశిక్‌కు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తుండేవాడు. అయితే బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. క్రమంగా బెట్టింగ్‌లకు బానిసగా మారాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటు పడ్డాడు. దీనికోసం ఆస్తిపాస్తులు కూడా తాకట్టు పెట్టడం ప్రారంభించాడు.
Also Read: Khammam: అధికారుల నిర్లక్ష్యం.. మున్నేరు నదిలో ముగ్గురు చిన్నారులు జలసమాధి
ఇది గమనించిన తండ్రి సత్యనారాయణ కుమారుడికి మంచి మాటలు చెప్పాడు. బెట్టింగ్ అలవాటు మానుకోవాలని కౌశిక్‌ను తండ్రి హెచ్చరించాడు. అయినా పద్ధతి మార్చుకోలేక ఇప్పటివరకూ రూ.2 కోట్ల వరకు డబ్బులు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పోగొట్టాడు. వీటికోసం విలువైన ఆస్తులను కూడా అమ్మేశాడు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోకపోవడంతో కొడుకుపై తండ్రి సత్యనారాయణకు పట్టరాని కోపం వచ్చింది. ఈ క్రమంలో శనివారం రాత్రి కుమారుడు ముకేశ్‌పై తండ్రి దాడి చేశాడు. కుమారుడి తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడు. ఈ ఘటనతో ముకేశ్ కుమార్ తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా బెట్టింగ్ కారణంగా మేడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటు బెట్టింగ్ కారణంగా అమ్మేసుకున్నారు. బెట్టింగ్ కోసం ఎన్నో రూ.కోట్లలో ముకేశ్ అప్పులు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారమే తండ్రీ కుమారుల మధ్య గొడవకు దారితీసినట్లు తేలింది. కాగా ఇలాంటి సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్రికెట్, ఇతర ఆన్‌లైన్ బెట్టింగ్‌లు పెడుతుండడంతో కొందరు వీటికి బానిసలుగా మారుతున్నారు. ఒక్కసారి అలవాటు చేసుకున్నవారు అందులోనే మునిగితేలుతున్నారు. బెట్టింగ్ కోసం ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో కొన్ని దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి కోవలోనిదే ఈ సంఘటన. ప్రజలు బెట్టింగ్‌లకు పాల్పడవద్దని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter