Palnadu Murder Case: కుమారుడి తల నరికిన తండ్రి.. ఊరంతా తిరుగుతూ హల్చల్
Father Kills Son In Palnadu: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్న కొడుకును దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో చోటు చేసుకున్న ఈ సంఘటన సంచలనం రేకిత్తిస్తోంది. కొడుకు తలను ఓ సంచిలో వేసుకుని ఆ ఉన్మాది ఊరంతా తిరిగాడు.
Father Kills Son In Palnadu: పల్నాడు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసైన ఓ ఉన్మాది.. కన్న కొడుకును దారుణంగా హత్య చేశాడు. అంతేకాదు కొడుకు మృతదేహం తల, మొండెం వేరు చేశాడు. తలను ఓ సంచిలో వేసుకుని బెల్ట్ షాపు వద్దకు వెళ్లి.. మద్యం సేవించాడు. అనంతరం ఊరంతా తిరుగుతూ.. తన కొడుకు తల నరికానంటూ అరిచాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా..
నకరికల్లు మండలంలోని గుళ్లపల్లి గ్రామానికి చెందిన బత్తుల వీరయ్య, అలివేలమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు అశోక్ వయసు 25 ఏళ్లు కాగా.. ఓ కుమార్తె ఉన్నారు. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. వీరయ్య కూలీపనులు చేస్తుండగా.. అలివేలమ్మ బతుకుదెరువు కోసం రెండేళ్ల కిందట కువైట్‌కు వెళ్లింది. అశోక్ భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. తండ్రీకొడుకులు ఇంటి వద్దే ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం తన కుమారుడి అశోక్ అకౌంట్‌కు అలివేలమ్మ 5 వేల రూపాయలు పంపించింది.
తనకు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని అశోక్‌ను వీరయ్య అడిగాడు. అతను ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గురువారం రాత్రి ఇద్దరు వేర్వేరుగా మద్యం సేవించి ఇంటికి వచ్చారు. మద్యం మత్తులో మరోసారి గొడవ పడ్డారు. ఈ క్రమంలో కుమారుడి తలపై వీరయ్య బండ రాయితో బలంగా బాదాడు. అశోక్ కిందపడిపోగా.. ఇంట్లో నుంచి వీరయ్య కత్తి తెచ్చుకుని తల, మొండెం వేరు చేశాడు. అనంతరం ఓ సంచిలో తలను వేసుకుని గ్రామంలోని బెల్ట్ షాపు వద్ద మద్యం సేవించాడు. నా కుమారుడి తల నరికానంటూ సంచిని తీసుకుని ఊరంతా తిరిగాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. గ్రామానికి చేరుకుని వీరయ్యను అరెస్ట్ చేశారు. అశోక్ భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సత్తెనపల్లి గ్రామీణ సీఐ చిట్టెం కోటేశ్వరరావు వెల్లడించారు.
Also Read: New Parliament Building: పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి టీడీపీ.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి