AP Students Spot Dead: తమిళనాడులో జరిగిన ఘోర ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం నింపింది. చెన్నైలో చదువుతున్న ఏపీ విద్యార్థులు స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఘోర ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రమాదవశాత్తు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. అతివేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జనుజ్జయ్యింది. ప్రమాద తీవ్రతకు విద్యార్థులంతా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల స్వస్థలమైన ఒంగోలు జిల్లాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Girl Friend Attack: నిఖాలో ప్రియురాలి తడాఖా.. పెళ్లి మండపంలో యాసిడ్, కత్తితో దాడి


ఒంగోలు జిల్లాకు చెందిన చేతన్, యుకేష్, నితీష్, వర్మ, రాంకోమన్, చైతన్య, విష్ణులు చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. వారు స్వస్థలం ఒంగోలు జిల్లాకు వెళ్లేందుకు ఆదివారం బయల్దేరారు. తిరువళ్లూరు సమీపంలోని రామంచెరి వద్ద చెన్నై-తిరుపతి జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. అతివేగంగా ఢీకొట్టడంతో కారు మొత్తం నుజ్జునుజ్జుగా మారింది. ఘటనా స్థలంలోనే ఐదుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు క్షతగాత్రులయ్యారు. ప్రమాదం ధాటికి హైవేపై పరిస్థితి భయానకంగా కనిపించింది. వెంటనే స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను తీసి ఆస్పత్రికి తరలించారు.

Also Read: Third Degree: తెలంగాణ పోలీసుల మరో కర్కశత్వం.. వెలుగులోకి మరో థర్డ్ డిగ్రీ ప్రయోగం


 


భయానక పరిస్థితి..
ఘోర ప్రమాదం జరగడంతో ఘటనా స్థలంలో భయానకంగా మారింది. కారు నుజ్జనుజ్జవడంతో మృతదేహాలన్నీ ఇరుక్కుపోయాయి. శరీర భాగాలన్నీ ఛిద్రమయ్యాయి. సీట్లలో కూరుకుపోవడంతో మృతదేహాలు వెలికితీసేందుకు చాలా సమయం పట్టింది. మృతదేహాలను తిరువళ్లూరు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది. వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కనకమ్మసత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఏపీకి చెందిన వారని తెలియడంతో బాధిత కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కాగా ప్రమాదం విషయం తెలుసుకున్న ఏపీ మంత్రులు వివరాలు ఆరా తీసినట్లు సమాచారం. వీలైనంత త్వరగా మృతదేహాలను ఏపీకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక ఒంగోలు జిల్లాలో బాధిత కుటుంబసభ్యులను స్థానిక ప్రజాప్రతినిధులు పరామర్శించినట్లు సమాచారం. 


మృతులు వీరే
చైతన్య, విష్ణు, చేతన్, యుకేశ్‌, నితీశ్‌, వర్మ, రామ్‌కోమన్
గాయపడిన చైతన్య, విష్ణు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter