Vinayaka Chaturthi 2024: వినాయక చవితి ఉత్సవాల్లో కొత్త సంస్కృతి వస్తోంది. నిమజ్జనం కోసం అంగరంగ వైభవంగా సాగనంపే సంస్కృతి తప్పని.. వినాయకుడు వచ్చే సమయంలోనే సంబరంగా స్వాగతం పలకాలనే ధోరణి వస్తోంది. ఈ క్రమంలోనే వినాయకుడి విగ్రహం తీసుకువస్తున్న సందర్భంగా బ్యాండ్‌ మేళాలు, డీజేలతో స్వాగతం పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్వాహకులు సంబరంగా వినాయక గణేశ్‌ విగ్రహం తీసుకువస్తున్న క్రమంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతం చోటుచేసుకుని పలువురు గాయపడిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Harish Rao: వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన హరీశ్ రావు.. రేవంత్‌ ప్రభుత్వంపై శాపనార్థాలు


 


దేశంలోనే హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాలు ప్రత్యేకతను పొందాయి. ఈనెల 7వ తేదీన వినాయక చవితి కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు నిర్వాహకులు మంగళవారం వినాయకుడిని వైభవంగా తీసుకువస్తున్నారు. సంబరంగా తీసుకువస్తున్న క్రమంలో వినాయకుడి విగ్రహం విద్యుత్‌ తీగలకు తగిలింది.

Also Read: Telangana Floods: విరాళంపై రగడ.. వైజయంతి మూవీస్‌కు తెలంగాణ విద్యార్థుల వార్నింగ్‌


 


విగ్రహం నుంచి ప్రవహించిన విద్యుత్‌ ట్రాక్టర్‌కు పాకింది. అర్తింగ్ రావడంతో ఒత్తిడికి గురయి ట్రాక్టర్ టైర్లు పగిలిపోయాయి. ఈ ఘటనలో 5 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో వారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని కరెంట్‌ సరఫరాను నిలిపివేశారు. ఈ సంఘటనపై అత్తాపూర్ పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు. కాగా ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అనుమతి లేకుండా సంబరంగా వినాయక విగ్రహాలు తీసుకురావడంపై పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రమాదాలు పొంచి ఉండడంతో ఇకపై విగ్రహాలు సంబరంగా తీసుకురావడంపై నిషేధం విధించే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter