Hyderabad Crime News: స్నేహం పేరిట అనేక మోసాలు జరుగుతున్నాయి. వెన్నంటే ఉండే స్నేహితులు అవసరం వచ్చినప్పుడు వెన్నుపోటు పొడుస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరి దుర్బుద్ధితో స్నేహం అనే మాటకు అర్థం మారుతోంది. తాజాగా తెలంగాణలో జరిగిన ఓ వివాదంలో ఒక స్నేహితుడు నమ్మించి మోసం చేసి హత్యకు పాల్పడ్డాడు. ఇంటి పత్రాలతో స్నేహితుడి ఇంటిని అమ్మేశాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్‌ శివారులో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Medaram: సమ్మక్క సారక్క జాతరలో పోలీస్‌ అత్యుత్సాహం.. భార్యాభర్తలపై చేయి చేసుకున్న వైనం


హైదరాబాద్‌ శివారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌గూడ రాధాకృష్ణానగర్ కాలనీలో దశరథ (52) తన కుటుంబంతో నివసిస్తున్నాడు. తన స్నేహితుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని గ్రహించాడు. అతడి పరిస్థితి చూసి తట్టుకోలేక ఏదైనా సహాయం చేయాలని ఆలోచించాడు. అతడి కష్టాలు తొలగిపోయేందుకు తన ఇంటి పత్రాలను ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా ఆ స్నేహితుడికి దశరథ్‌ తన ఇంటి పత్రాలను ఇచ్చాడు. లోన్ తీసుకుని అప్పులు తీర్చుకుని తన స్నేహితుడు సంతోషశంగా ఉంటాడని నమ్మాడు. అనుకున్నట్టుగానే ఇంటి పత్రాలతో ఆ స్నేహితుడు రుణం తీసుకుని అప్పు చెల్లించాడు. 

Also Read: Kurnool Court: జంట హత్య కేసులో సంచలన తీర్పు.. సంసారానికి పనికి రాని భర్తకు, మామకు ఉరిశిక్ష


స్నేహితుడి అప్పుల బాధ తొలగిపోవడంతో దశరథ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక కష్టాలు తీరడంతో తన ఇంటి పత్రాలు తిరిగివ్వాలని దశరథ్‌ కోరాడు. ఇక్కడే కీలక మలుపు జరిగింది. అప్పు చెల్లించిన తర్వాత ఇంటి పత్రాలు ఇవ్వకుండా స్నేహితుడు ఇబ్బందులకు గురి చేశాడు. ఇంటి పత్రాలు ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చురేపింది. పత్రాల కోసం స్నేహితుడితో దశరథ్‌ వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలో ఘర్షణ చోటుచేసుకుంది.


అయితే ఇంటి పత్రాలతో స్నేహితుడు చేసిన మరో మోసం బయటకు వచ్చింది. ఆ ఇంటి పత్రాలను అడ్డంగా పెట్టుకుని దశరథ్‌ ఇంటికి మరొకరికి విక్రయించాడు. కొన్నవారు ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. ఇల్లు ఖాళీ చేయమని దశరథ్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. తోపులాటలో దశరథ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక అతడి గుండె పగిలింది. ఈ ఘర్షణ సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో ఇల్లు కొన్నవారు పరారయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచి పని చేయబోతే ఇంతటి దారుణం చోటుచేసుకోవడంతో మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్నేహితుడి చేసిన మోసం తట్టుకోలేక దశరథ్‌ చనిపోయాడని స్థానికులు చెబుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి