Gang Rape on 16 Year Girl: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నుంచి సంచలన వార్త ఒకటి తెర మీదకు వచ్చింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఆరోపణలపై పోలీసులు ఏకంగా 8 మందిని అరెస్టు చేశారు. డిసెంబర్ 16-17 మధ్య రాత్రి ఈ అత్యాచార ఘటన జరిగినట్లు పోలీసులు ఆదివారం మీడియాకు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిందితులు మొదట ఖాళీ బంగ్లాలో బాలికపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై ఆమెను బీచ్‌కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని పోలీసులు గుర్తించారు. ఇక నిందితులందరిపై సామూహిక అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పాల్ఘర్ జిల్లా సత్పతి రూరల్ పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు.


డిసెంబర్ 16వ తేదీ రాత్రి 8 గంటల నుంచి డిసెంబర్ 17వ తేదీ ఉదయం 10 గంటల వరకు నిందితులు తనను చిత్రహింసలకు గురిచేశారని బాలిక లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. “డిసెంబర్ 16 రాత్రి 8 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు నిందితులు తనపై ఒకరి తర్వాత ఒకరుగా అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు’’ అని బాధితురాలు శనివారం తన ఫిర్యాదులో పేర్కొంది.


నిందితులు ఆమెను మహిమ్ గ్రామంలోని ఖాళీ బంగ్లాకు తీసుకెళ్లారు, అక్కడ వారంతా ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను బీచ్‌కు తీసుకెళ్లి  పొదల్లోకి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారని అంటున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు ఆదివారం ఉదయం మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పోలీసులు వారిపై సెక్షన్ 376 (డి), సెక్షన్ 366 (ఎ), సెక్షన్ 341, సెక్షన్ 342, సెక్షన్ 323 అలాగే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి నిందితులందరినీ విచారిస్తున్నారు.


Also Read: శ్రద్దా వాకర్ కేసు చూసి పిన్నిని పది ముక్కలు చేసిన వ్యక్తి.. దారుణాతి దారుణంగా!


Also Read: Jabardasth Vinod ill: జబర్దస్త్‌ వినోద్‌కి ఏమైంది? ఇలా అయిపోయాడేంటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook