Visakhapatnam Ganja Batch Attack on Woman: ఏపీలో గంజాయి మత్తులో నేరాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల సీఎం జగన్ ఇంటికి సమీపంలో ఓ అంధ యువతి ఘటన మరువకముందే.. విశాఖలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఓ మహిళపై దాడి చేసి.. ఆమె దుస్తులు చింపేశారు. బాధితురాలు భర్త, సోదరుడు అడ్డుకునే ప్రయత్నం చేయడగా.. వారిపై దాడి చేసి మహిళ పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించారు. వివరాలు ఇలా..  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖపట్నం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో స్థానిక రంగిరీజు వీధికి చెందిన ఓ కుటుంబం రాత్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లింది. తిరిగి రాత్రి  9:30 గంటల ఇంటికి వస్తున్నారు. భార్యాభర్తతో పాటు సోదరుడు ముగ్గురు కలిసి వస్తుండగా.. దారిలో ఆకతాయిలు అడ్డుకున్నారు. గంజాయి, మద్యం మత్తులో అసభ్యకంగా ప్రవర్తించారు. దీంతో భర్త, సోదరుడు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారిద్దరిపై దాడి చేస్తూ.. పిడిగుద్దుల వర్షం కురిపించారు నిందితులు. భర్త, సోదరుడి ముందే మహిళ పట్ల ఇష్టానుసారం వ్యవహరిస్తూ.. దుస్తులు చించేశారు. అనంతరం వారిని తప్పించుకుని విశాఖ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 


ఇటీవల విశాఖలో భారీగా గంజాయి అమ్మకాలు పెరిగిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాన్ షాపులతో పాటు చిన్న, చిన్న కిరాణా కొట్టుల్లోనూ గంజాయి ప్యాకెట్లు దొరుకుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో గంజాయి మత్తులో యువకులు ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారని వాపోతున్నారు. పోలీసులు ఇకనైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 


సీఎం జగన్‌ నివాసానికి కూతవేటు దూరంలో తాడేపల్లిలో గంజాయి మత్తులో 17 ఏళ్ల అంధ యువతిని ఓ యువకుడు గంజాయి మత్తులో హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. యువతి ఇంటికి వెళ్లి అసభ్యంగా రాజు అనే అసభ్యంగా ప్రవర్తించారు. అతని ప్రవర్తనపై అమ్మ, పెద్దమ్మకి అంధయువతి చెప్పగా.. రాజుని వాళ్లు నిలదీశారు. అయితే తనకు చెల్లి లాంటిదంటూ వాళ్లను నమ్మించాడు. ఇలా అడిగిన ఐదు నిమిషాల్లోనే యువతి తలపై విచక్షణారహితంగా నరికి.. ఆ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాజును పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. 


Also Read: Chetan Sharma Sting Operation: జస్ప్రీత్ బుమ్రా గురించి సంచలనం విషయం బయటపెట్టిన టీమిండియా చీఫ్ సెలక్టర్!


Also Read: Ind Vs Aus: సరికొత్త రికార్డు సృష్టించిన రవీంద్ర జడేజా.. ఇమ్రాన్ ఖాన్ రికార్డు బద్దలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook