Girl Gets Pregnancy: ప్రేమకు, ప్రెగ్నెన్సీకి అడ్డం రాని కులం.. పెళ్లికొచ్చింది..
Girl Gets Pregnancy: డిగ్రీ చదువుకునే రోజుల్లో నాగరాజుతో ఏర్పడిన పరిచయం కాస్త ఇష్టంగా మారడంతో ఇద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని... ఇప్పుడు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లికి నిరాకరిస్తున్నాడంటోంది బాధితురాలు.
Girl Gets Pregnancy: ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతిని గర్భవతిని చేశాడు. చివరకు పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి పెళ్లికి నిరాకరించి ముఖం చాటేశాడు. దీంతో ప్రేమికుడి ఇంటి ముందు ఆ ప్రియురాలు నిరసన చేపట్టింది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం తుజాల్పూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దోమకొండ గ్రామానికి చెందిన రాధకి ( పేరు మార్చడం జరిగింది ) డిగ్రి చదువుకుంటున్న సమయంలో తుజాల్పూర్ గ్రామానికి చెందిన నాగరాజ్ గౌడ్‌తో పరిచయం ఎర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో నాగరాజు గౌడ్, రాధ గత ఆరేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. అంతేకాకుండా రాధ, నాగారాజు గౌడ్లు ఒకరి పేరు ఒకరు చేతులపై టాటోలను వేయించుకున్నారు.
పెళ్లికి అడ్డొచ్చిన కులం..
నాగరాజు గౌడ్, రాధల కులాలు వేరు కావడంతో నాగరాజు గౌడ్ ఆ పెళ్లికి నిరాకరించాడు. దీంతో గత మూడు నెలలుగా నాగరాజ్ గౌడ్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో కామారెడ్డి డిఎస్పిని ఆశ్రయించిన రాధ.. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుని న్యాయం చేయాల్సిందిగా మొరపెట్టుకుంది. రాధ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నాగరాజు గౌడ్, ఆమెని పిలిపించి డిఎస్పి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ నాగరాజు గౌడ్‌లో మార్పు లేకపోవడంతో తుజాల్పూర్ గ్రామంలోని నాగరాజు గౌడ్ ఇంటిముందు రాధ, ఆమె కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఇంటి ముందు బెఠాయించి నిరసనకి దిగారు. తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడ నుండి జరిగేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.
ఈ ఘటనపై బాధితురాలు రాధ మాట్లాడుతూ... డిగ్రీ చదువుతున్న సమయంలో నాగరాజ్ గౌడ్‌తో పరిచయం ఏర్పడిందని.. ఆ పరిచయం కాస్త ఇష్టంగా మారడంతో ఇద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని... కులాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మోసం చేశాడని ఆరోపించింది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.