Girlfriend Acid Attack: మరో యువతితో ప్రియుడికి పెళ్లి.. వధూవరులపై యాసిడ్‌తో ప్రియురాలు దాడి

Chhattisgarh Crime News: తనను ప్రేమించి మోసం చేసి.. మరో యువతితో పెళ్లికి సిద్ధమైన యువకుడిపై యాసిడ్‌తో దాడి చేసింది ఓ యువతి. పెళ్లి మండపంలోనే ఈ ఘటన జరగడంతో 12 మంది గాయపడ్డారు. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Chhattisgarh Crime News: అమ్మాయిలు ప్రేమించకపోతే యాసిడ్ దాడి చేసిన అబ్బాయిలను చూశాం గానీ.. ఓ ప్రేమించిన యువకుడు మోసం చేస్తే యాసిడ్ దాడి చేసే అమ్మాయిలను చూశారా..! తనను కాదని వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన యువకుడిపై ఓ యువతి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. పెళ్లి మండపానికి యాసిడ్ బాటిల్‌తో వచ్చి ఏకంగా వధూవరులపై దాడి చేసింది. అనంతరం అక్కడి నుంచి పరార్ అయింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో భాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా..
దమృధర్ బఘెల్‌కు అనే యువకుడికి, నిందితురాలికి మధ్య గత ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. యువతిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. తీరా ఆమెకు తెలియకుండా మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో యాసిడ్ దాడి చేయాలని నిర్ణయించుకుంది.
ఈ నెల 19న సాయంత్రం ఛోటే అమాబాల్‌లో ప్రియుడి వివాహ వేడుక జరుగుతోంది. ముందుగానే పక్కా ప్లాన్‌తో ఉన్న యువతి.. ప్యాంట్, షర్ట్ ధరించి కళ్యాణ మండపానికి వచ్చింది. సమయం కోసం వేచి చూసింది. ఈ సమయంలోనే బలమైన గాలులు వీయడంతో కరెంట్ ఆఫ్ అయిది. అవకాశం దొరికిందని వధూవరులపై యాసిడ్ విసిరింది యువతి. అనంతరం ఆ చీకటిలో అక్కడి నుంచి పరార్ అయింది. లైట్స్ ఆఫ్ అవ్వడంతో ఏం జరిగిందోనని పెళ్లి మండపంలో అందరూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. యాసిడ్ దాడిలో వధూవరులతోపాటు దాదాపు 12 మంది గాయపడ్డారు. భాన్‌పురిలోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. తీవ్రంగా గాయపడిన వారిని క్వీన్స్ ఆసుపత్రికి తరలించారు.
Also Read: Husband, wife Jokes: అందమైన యువతిని చూస్తున్న భర్త భార్యకు ఎలా చిక్కాడో చూడండి
గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేసినట్లు కేసు నమోదు చేసుకున్న భాన్‌పురి పోలీసులు.. నిందితుల కోసం గాలించారు. దగ్గరలోని ఓ కంటైనర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మంటలు చెలరేగే పదార్థం తెచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అనుమానితులను విచారించారు. చివరగా ప్రేమించిన యువతే.. ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి వివరాలు సేకరించారు. తనను మోసం చేసినందుకే యాసిడ్ దాడి చేసినట్లు ఒప్పుకుంది. తనతో అబద్ధం చెబుతూ.. పెళ్లి విషయం దాచిపెట్టాడని తెలిపింది. అల్లం శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనంతో దాడి చేసినట్లు వెల్లడించింది. యువతి యాసిడ్ దాడితో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది.
Also Read: Ajinkya Rahane IPL: రఫ్పాడిస్తున్న అజింక్యా రహానే.. ఆ టైమింగే వేరప్పా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి