Gujarat Woman Bleeds to Death: గుజరాత్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోటల్‌లో 23 ఏళ్ల యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో శృంగారంలో పాల్గొన్న తరువాత రక్తస్రావంతో మరణించింది. ఆమె ప్రైవేట్ పార్ట్‌లో నుంచి అధిక రక్తస్రావం జరగడంతోనే మరణించిందని ఆమె ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. యువతికి రక్తస్రావం జరుగుతున్న సమయంలో ఆమె బాయ్‌ఫ్రెండ్‌ అంబులెన్స్‌కు కాల్ చేయకుండా.. బ్లీడింగ్ ఎలా ఆపాలో ఆన్‌లైన్‌లో వెతికాడు. మళ్లీ ఆమెతో సంభోగానికి యత్నించగా.. రక్తస్రావం ఇంకా ఎక్కువై ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తరువాత ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మృతి చెందింది. ఈ ఘటన గత నెల 23న నవ్‌సారి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Washing Machine Discount Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో 10.5 kg సామర్థ్యం కలిగిన  Motorola వాషింగ్‌ మెషిన్‌ రూ.21 వేలే.. ఇవే కాదు మరెన్నో ఆఫర్స్!


 నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినితో మూడేళ్ల క్రితం ఓ యువకుడికి పరిచయం ఏర్పడింది. అయితే ఏడు నెలల క్రితం వరకు ఒకరితో ఒకరు కాంటాక్ట్‌లో లేరు. ఏడు నెలల సంబంధం తరువాత సెప్టెంబర్ 23న కొంత ప్రైవేట్‌గా సమయం గడపాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ రూమ్‌ తీసుకుని ఇద్దరు శృంగారంలో పాల్గొన్నారు. అయితే ఆమెకు రక్తస్రావం కావడంతో ఏం చేయాలో తెలియక ఆన్‌లైన్‌లో రెమిడీస్ కోసం వెతికాడు.


రక్తస్రావం ఆపడానికి గుడ్డను ఉపయోగించి ప్రయత్నించాడు. అయినా రక్తస్రావం తగ్గకపోవడంతో ఆమె మూర్ఛపోయింది. భయాందోళనకు గురైన ఆ యువకుడు.. వెంటనే స్నేహితుడిని హోటల్‌కు పిలిపించాడు. అక్కడి నుంచి ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది సివిల్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఆమెను సివిల్‌ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది. పోలీసులు మహిళ మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్ష కోసం సూరత్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. యువకుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.


ఆమెకు రక్తస్రావం అవుతుందని తెలిసినా.. యువకుడు శృంగారానికి ప్రయత్నించినట్లు నివేదికలో వెల్లడైంది. హోటల్‌లో 60 నుంచి 90 నిమిషాలు ఉండగా.. ఆమె మధ్యాహ్నం 2:15 గంటలకు మరణించినట్లు తెలుస్తోంది. హోటల్ నుంచి బయటకు వెళ్లే ముందు క్ష్యాలను నాశనం చేయడానికి రక్తపు మరకలను శుభ్రం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఆమె ప్రైవేట్ పార్ట్‌లలో తీవ్రమైన గాయాలు అయినట్లు తేలింది. దీంతో అధిక రక్తస్రావం సంభవించడంతో ఆమె మరణించినట్లు వెల్లడైంది. జలాల్‌పూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: New Rules From Today: ఈరోజు నుంచి మారనున్న 10 రూల్స్‌ ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.