Teen Thrashed: రూ.10 చిప్స్ దొంగిలించాడని దారుణం.. బాలుడిని నగ్నంగా ఊరేగింపు..!
Himachal Pradesh Crime News: దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. హిమాచల్‌లో దారుణంగా ప్రవర్తించారు. బాలుడిని చితక్కొట్టి.. నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Himachal Pradesh Crime News: హిమాచల్ ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రూ.10 చిప్స్ ప్యాకెట్ దొంగతం చేశాడనని 15 ఏళ్ల బాలుడిని నగ్నంగా ఊరేగించిన ఉదంతం చోటు చేసుకుంది. మార్కెట్‌లో నగ్నంగా చేసి.. చితబాదారు. కొద్ది రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనలో బాధ్యులైన ఐదుగురిని నిందితులను అరెస్ట్ చేసి.. స్టేషన్‌కు తరలించారు. సిమ్లాలోని రోహ్రు సబ్ డివిజన్‌లోని టిక్కర్ తహసీల్ మార్కెట్‌లో జరిగిన ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా..
నేపాల్‌కు చెందిన వ్యక్తి స్థానికంగా తోటలో కూలీ పని చేస్తున్నాడు. ఆయన కుమారుడు (15) టిక్కర్ మార్కెట్‌లోని తన దుకాణంలో చోరీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా కంటిలో కారం కూడా పోసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలుడిపై నిర్ధాక్షిణ్యంగా దాడికి పాల్పడుతున్నా.. చుట్టుపక్కల వాళ్లు ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
ఈ నెల 31వ తేదీన దుకాణదారుడు తన కుమారుడిని కొట్టి టిక్కర్ మార్కెట్‌లో నగ్నంగా చేసి ఊరేగించాడని బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కళ్లలో కారం కూడా పోశారని పోలీసుల ముందు తన ఆవేదన వ్యక్తం పరిచాడు. తమ దుకాణంలోని చిప్స్‌ను బాలుడు దొంగతనం చేశాడని దుకాణదారుడు ఆరోపించాడు. చిప్స్ ధర కేవలం పది రూపాయలు మాత్రమే అంటుండగా.. బాలుడి నుంచి 10 పాల ప్యాకెట్లు, 10 స్టింగ్ బాటిళ్లు, 4 జ్యూస్ బాటిళ్లు, 10 ఖరీదైన చాక్లెట్లు సహా పలు వస్తువులు లభించాయని దుకాణదారుడు చెబతున్నాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు దుకాణదారుడితోపాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రోహ్రు రవీంద్ర నేగి వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి