Husband And Pregnant Wife Died In Kadapa: వారిద్దరికి పెళ్లై ఏడాది క్రితమే వివాహమైంది. భర్త వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య గర్భిణీ కావడంతో ఇంట్లో సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఇంతలో ఆ కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో చివరకు రైలు కిందపడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా..  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కడప నగరంలో విజయదుర్గా కాలనీకి చెందిన సాయికుమార్ రెడ్డికి హేమమాలినీతో ఏడాది కిందట వివాహం జరిగింది. సాయి కుమార్ రెడ్డి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హేమమాలిని ప్రస్తుతం 8 నెలల గర్భవతిగా ఉంది. ఇటీవల వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో తెలియక దారుణ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రి కడప శివారులోని కనుమలోపల్లి సమీపంలో రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. బుధవారం ఉదయం మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


ఘటన స్థలానికి చేరుకున్న కడప రైల్వే పోలీసులు మృతులను సాయి, హేమమాలినిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మృతికి ఆర్థికపరమైన ఇబ్బందులే కారణమా..? లేక ఇతర సమస్యలు ఏవైనా ఉన్నాయనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దంపతుల మృతితో స్థానికంగా తీవ్రవిషాదం నెలకొంది. 


Also Read: Karnataka Assembly Elections: బీజేపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత గుడ్ బై  


అన్ని సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని నిపుణులు అంటున్నారు. ధైర్యంగా సమస్యలు ఎదుర్కొని వాటితో పోరాడాలని.. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని కోరుతున్నారు. కష్టాలు అందరికీ వస్తాయని.. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే విజయం సాధించగలుతామని సూచిస్తున్నారు. అనవసరంగా ప్రాణాలు తీసుకుంటే ఏమీ సాధించలేరని.. కుటుంబ సభ్యులను జీవితాంతం విషాదంలో నెట్టకండని కోరుతున్నారు. 


Also Read: SRH Vs MI Highlights: ఐపీఎల్‌లో ఫస్ట్ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్.. సంబురాలు చూశారా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook