Husband Killed By Wife And Son: శ్రద్ధా వాకర్ హత్య తరువాత అదే తరహాలో హత్య చేసి శవాన్ని ముక్కలు చేసి పడేసిన ఘటనలు దేశంలో రెండు చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి ఉత్తర్ ప్రదేశ్ లో కాగా తాజాగా రెండోది పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగనస్ జిల్లాలోని బరైపూర్ లో రిటైర్డ్ నేవి ఉద్యోగిని సొంత భార్య, కొడుకే హత్య చేసి, శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి హత్య చేసిన ఆనవాళ్లు కూడా దొరక్కుండా చేశారు. కానీ పోలీసుల నుంచి, చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు కదా.. అందుకే తమకు తెలియకుండానే చేసిన ఒక్క తప్పుతో పోలీసుల ముందు వాళ్ల బండారాన్ని వాళ్లే బయటపెట్టుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులకు పెద్దగా పని పెట్టకుండా హంతకులు తమంత తామే దొరికిపోయేలా చేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 55 ఏళ్ల ఉజ్వల్ చక్తవర్తి నేవిలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందాడు. భార్య, కాలేజీకి వెళ్లే వయస్సు ఉన్న కొడుకు ఉన్నారు. నవంబర్ 12న తండ్రీ కొడుకుల మధ్య కాలేజీ ఎగ్జామ్ ఫీజు విషయంలో వివాదం తలెత్తింది. రూ. 3 వేలు ఎగ్జామ్ ఫీజు ఇవ్వడానికి నిరాకరించిన తండ్రి ఉజ్వల్ చక్రవర్తి.. కొడుకుపై చేయి చేసుకున్నాడు. దీంతో తండ్రిపై ఆగ్రహం చెందిన కొడుకు అతడిని బలంగా వెనక్కి నెట్టేయగా వెళ్లి కుర్చీకి తగిలి కిందపడి స్పృహ కోల్పోయాడు. అంతటితో ఆగని చక్రవర్తి కుమారుడు.. అదే ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి తండ్రిని చచ్చే వరకు కొట్టి హత్య చేశాడు.


చక్రవర్తి కుమారుడు పాలిటెక్నిక్ లో కార్పెంట్రీ కోర్స్ చేస్తుండటంతో అతడి కాలేజీ బ్యాగులో హ్యాక్సాబ్లేడ్ ఉంది. శవాన్ని ముక్కలు ముక్కలు చేసి మాయం చేసేందుకు ప్లాన్ చేసిన తల్లీ, కొడుకులు ఇద్దరూ ఆ శవాన్ని హ్యాక్సా బ్లేడ్‌తో ముక్కలు ముక్కలు చేసి పాలిథిన్ సంచుల్లో చుట్టారు. వాటిని తీసుకుని వెళ్లి ఒక్కో శరీర భాగాన్ని ఒక్కో చోట పడేశాడు. సైకిల్ పైనే ఆరుసార్లు చక్కర్లు కొట్టిన ప్రసాద్ కుమారుడు మొత్తానికి తండ్రి శవాన్ని లేకుండా మాయం చేశాడు.


పోలీసులకు ఎలా దొరికిపోయారు ?
ఉజ్వల్ చక్రవర్తిని చంపి, శవాన్ని ముక్కలు చేసి మాయం చేసిన తల్లీ, కొడుకులు.. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు మరో ప్లాన్ చేశారు. అన్ని కేసుల్లాగే ఏమీ ఎరుగనట్టే వెళ్లి పోలీసులకు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. కాకపోతే చేసిన తప్పు వారిని ఊరకే ఉండనివ్వలేదు. అర్ధరాత్రి దాటాకా తెల్లవారక ముందే తల్లీ, కొడుకు ఇద్దరూ కలిసి పోలీసు స్టేషన్ కి వెళ్లి తన తండ్రి చక్రవర్తి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. వాళ్లు ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయమే పోలీసులకు అనుమానం కలిగించింది. తెల్లవారిన తర్వాత కూడా మిస్సింగ్ కంప్లయింట్ చేయొచ్చు కానీ ఇలా అర్ధరాత్రి దాటాకా తెల్లవారక ముందే ఇప్పటికిప్పుడు ఉన్నఫళంగా వారు పోలీసు స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయడం ఏంటా అని పోలీసులు ఆలోచనలో పడ్డారు. 


వారి నుంచి మిస్సింగ్ కంప్లయింట్ తీసుకునే క్రమంలో వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు వారు పొంతన లేని సమాధానం చెప్పారు. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు.. ఉజ్వల్ చక్రవర్తి కొడుకును తమదైన స్టైల్లో విచారించారు. దీంతో తన చేసిన నేరాన్ని అంగీకరించాడు. తన తండ్రిని తానే హత్య చేశానని పోలీసులకు తెలిపాడు. ఉజ్వల్ చక్రవర్తి రోజూ మమ్మల్ని హింసించే వాడని, అతడి టార్చర్ భరించలేకే ఈ ఘాతుకానికి ఒడిగట్టామని తల్లి - కొడుకు ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. కుమారుడు చెప్పిన వివరాల ఆధారంగా తండ్రి శరీర భాగాలను గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని మర్డర్ కేసు నమోదు చేశారు. మిస్సింగ్ కేసు కాస్తా మర్డర్ కేసుగా నమోదైంది.


Also Read : Aayushi Chaudhary Murder Case: వీడిన ఆయూషి చౌదరి మర్డర్ మిస్టరీ.. కిల్లర్స్ ఎవరో కాదు..


Also Read : Shraddha Murder Case: అఫ్తాబ్ ఇంట్లో పదునైన వస్తువు, అడవిలో శ్రద్ధా వాకర్ ఎముకలు


Also Read : Shraddha Walkar Murder Case: శ్రద్ధాను చంపిన తర్వాత రాత్రంతా అఫ్తాబ్ ఏం చేశాడో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook