Suryapet Son Murder Case: కన్నకొడుకు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బుల కోసం వేధిస్తున్నాడు. చివరికి కన్నతల్లి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే.. చనిపోయినా ఒకటే అని ఆ తల్లిదండ్రులు భావించారు. సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు. కానీ ఓ తప్పు చేయడంతో పోలీసులకు దొరికిపోయారు. సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖమ్మానికి చెందిన క్షత్రియ రామ్‌సింగ్‌, రాణిబాయి భార్యాభర్తలు. వీరికి సాయినాథ్‌ (26), ఓ కుమార్తె ఉన్నారు. సాయినాత్ డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసి.. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. గత నాలుగేళ్లుగా ఏ పని చేయకుండా.. డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. అంతేకాకుండా తల్లి పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో కొడుకు ప్రవర్తనతో రామ్‌సింగ్‌, రాణిబాయి విసుగెత్తిపోయారు. 


ఇక ఇలాంటి కొడుకు తమకు అవసరం లేదనుకున్నారు. ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించకున్నారు. ఈ విషయం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉంటున్న రాణిబాయి తమ్ముడు సత్యనారాయణ సింగ్‌కు చెప్పారు. అతను తనకు తెలిసిన మిర్యాలగూడ మండలం ధీరావత్‌ తండాకు చెందిన ఆటో డ్రైవర్‌ రమావత్‌ రవికి విషయం చెప్పాడు. అదే తండాకు చెందిన పి.నాగరాజు, బి.రాంబాబు, మరో ప్రాంతానకి చెందిన ధనవాత్ సాయి అనే వ్యక్తితో 8 లక్షల రూపాయలకు సుపారీ మాట్లాడుకున్నారు.


అక్టోబరు 18వ తేదీన సాయినాథ్‌ను సత్యనారాయణసింగ్‌, ఆటో డ్రైవర్‌ రవి పార్టీకి చేసుకుందామని పిలిచారు. అందరూ కలిసి సాయినాథ్ కారులోనే  వెళ్లి.. నల్గొండ జిల్లా కల్లేపల్లిలోని మైసమ్మ దేవాలయం వద్ద మద్యం తాగారు. సాయినాథ్ బాగా మద్యం తాగించి..‌ మెడకు ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం అదేకారులో శవాన్ని తీసుకుని వచ్చి మూసీ నదిలో పడేసి వెళ్లిపోయారు. 


మరుసటి రోజు శవం నదిలో తేలడంతో.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. తల్లిదండ్రులు ఆ మృతదేహం తమ కొడుకుదే అంటూ శవాన్ని తీసుకెళ్లారు. ఇక విచారణలో భాగంగా.. సీసీ కెమెరాలను పోలీసులు నిందితులను సులభంగా పట్టేశారు.


హత్య జరిగిన రోజు శూన్యంపహాడ్‌ వద్ద కనిపించిన కారు.. సాయినాథ్ తల్లిదండ్రులు తీసుకువచ్చిన కారు ఒకటేనని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం ఒప్పుకున్నారు. తమ కొడుకుని హత్య చేయించినట్లు ఒప్పుకున్నారు. మృతుడి తల్లిదండ్రులు మేనమామ సత్యనారాయణ సింగ్‌తో పాటు నలుగురిని అరెస్ట్ చేసినట్లు హుజూర్‌నగర్‌ సీఐ రామలింగారెడ్డి తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని చెప్పారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూడా అదే కారులో రావడంతో నిందితులు దొరికిపోయారు.


Also Read: Dewald Brevis: బేబీ ఏబీ తుఫాన్ ఇన్నింగ్స్.. 57 బంతుల్లోనే 162 పరుగులు   


Also Read: Minister KTR: సీఎం జగన్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఇదే..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook