Girl Commit Suicide: దిల్‌సుఖ్‌నగర్ ఉమెన్స్ హస్టల్ లో ఘోరం.. సూసైడ్ చేసుకున్న ఎంబీఏ యువతి..
Hyderabad Crime News: హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని సాహితీ(26) తన హాస్టల్ లో ఉరేసుకున్నట్లు చుట్టుపక్కల ఉన్న ఆమె ఫ్రెండ్స్ గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది.
MBA Girl Commit Suicide In Dilsukhnagar: కొందరు యువత చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూస్తుండారు. ప్రతి దానికి అతిగా ఆలోచిస్తుంటారు. కొందరు పెళ్లి కావట్లేదని, ఉద్యోగం రాలేదని సూసైడ్ లకు పాల్పడుతుంటారు. మరికొందరు ప్రేమలో విఫలమయ్యామన దారుణాలకు పాల్పడుతుంటారు. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని, చదువులో ఒత్తిడి భరించలేక కూడా ఆత్మహాత్యలకు పాల్పడుతుంటారు. జీవతం మీద విరక్తితో కూడా కొందరు చెడువ్యసనాలకు బానిసగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు యువకులు.. అమ్మాయిలను వేధించడం, ఇంట్లో వాళ్లకు తమ సమస్యలను చెప్పలేక కూడా ఇలాంఇటి కఠిన నిర్ణయాలను తీసుకుంటారు. కొన్ని చోట్ల ఎఫైర్ లు కూడా ఇలాంటి దారుణ ఘటనలు కారణమౌతున్నాయి. అయితే..ఒక యువతి సూసైడ్ చేసుకున్న దిల్‌సుఖ్‌నగర్ లో తీవ్ర కలకలంగా మారింది.
పూర్తి వివరాలు..
హైదారాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్ లోని ఒక ప్రైవేటు ఉమెన్స్ హస్టల్ లో షాకింగ్ ఘటన జరిగింది. ములుగు జిల్లాకు చెందిన సాహితీ(26) ఇక్కడ హస్టల్ లో ఉంటూ ఎంబీఏ చదువుకుంటుంది. ఈక్రమంలో.. ఆమె గురువారం తన గదిలో ఉరివేసుకుని విగత జీవిగా కన్పించింది. వెంటనే హాస్టల్ ఉన్న ఆమె ఫ్రెండ్స్ నిర్వాహలకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆప్రాంతమంతా తీవ్ర విషాదకరంగా మారిపోయింది. వెంటనే పోలీసులు.. యువతి డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించారు.
Read More: Pratibha Patil: ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్.. అసలేం జరిగిందంటే..?
కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. కాగా, యువతికి మరణానికి కుటుంబ సభ్యుల నుంచి ఏదైన వివాదం ఉందా.. లేది ప్రేమ, పెళ్లి మరేదైన కారణాలున్నాయా.. చదువుపై ఒత్తిడి ఏమైన ఎదుర్కొందా.. వంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. యువతి చనిపోయిన విషయం తెలియగానే..ఆమె కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని, తమ బిడ్డను పట్టుకుని గుండెలవిసేలా ఏడ్చారు. ఎన్నో ఆశలతో ఎంబీఏలో చేరిన తమ బిడ్డ అకాలమరణంచెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురౌతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter