Hookah Parlour In Hyderabad: హైదరాబాద్‌లో హుక్కా మత్తులో యువత మత్తెక్కిపోతుంది. నగరంలో హుక్కా సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. టోలీచౌకిలో అక్రమంగా హుక్కా పార్లర్‌పై శనివారం రాత్రి  టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేసి.. స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి పలు హుక్కా షాట్స్, హుక్కా ఫ్లేవర్లు, షీషా తయారీకి ఉపయోగించే ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.  టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు హుక్కా సెంటర్ నిర్వహణ గురించి సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. దాడులు చేశారు. కొంతమంది మైనర్లు కూడా హుక్కా సెంటర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా హుక్కా పార్లర్ నడిపిస్తున్న సయ్యద్‌ అర్షద్‌ హుస్సేనీ, సయ్యద్‌ ఒబైద్‌ హుస్సేనీలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో హుక్కా పార్లర్ నిర్వహిస్తున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారి తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IPL 2023 Points Table: రేసులో దూసుకువచ్చిన ఆర్‌సీబీ.. ఆ జట్టు మాత్రం ఔట్  


Also Read: Kadapa Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి