Karnataka Student Death: రాక్షసుడిగా మారిన ఉపాధ్యాయుడు.. విద్యార్థిని కొట్టి హత్య.. తల్లిపై రాడ్‌తో దాడి
Teacher beats student to death: అతను ఓ టీచర్. విద్యాబుద్ధులు నేర్పాల్సిన చేతులతో ఓ నిండు ప్రాణం తీశాడు. కర్కశత్వంతో తీవ్రంగా కొట్టి భవనం మొదటి అంతస్తు నుంచి విద్యార్థిని కిందకు పాడేశాడు. అడ్డువచ్చిన తల్లిపై కూడా రాడ్‌తో దాడి చేశాడు.
Teacher Beats Student to Death: కర్ణాటకలో స్కూల్ టీచర్ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గదగ్ జిల్లా హాడ్లిన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని కొట్టి.. పైకప్పు నుంచి కిందకు విసిరాడు. దీంతో విద్యార్థి మరణించాడు. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది.
అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో కాంట్రాక్టు టీచర్‌గా పనిచేస్తున్న ముత్తప్ప అనే ఉపాధ్యాయుడు.. 4వ తరగతి చదువుతున్న భరత్‌ని మొదటి అంతస్తులోని క్లాస్ నుంచి బయటకు లాగి కొట్టాడు. అనంతరం పాఠశాల మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఆ తర్వాత విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆ విద్యార్థి తల్లి కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె పేరు గీత. ఆమె కూడా పాఠశాలలో కాంట్రాక్ట్‌పైనే పనిచేస్తున్నారు. ఉపాధ్యాయుడు ముత్తప్ప విద్యార్థిని కొట్టడం ప్రారంభించడంతో భరత్ తల్లి గీత అక్కడికి చేరుకుని.. ఉపాధ్యాయుడి నుంచి కొడుకును రక్షించేందుకు ప్రయత్నం చేసింది. అతను ఆమెపై కూడా దాడి చేశాడు.
గీతపై ముత్తప్ప ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో ఆమె కూడా రక్తస్రావంతో గాయపడింది. ఆ తరువాత విద్యార్థిని మొదటి అంతస్తులోని టెర్రస్ అంచుకు తీసుకెళ్లి కింద పడేశాడు. దీంతో తల్లి గీత, కుమారుడు భరత్‌లను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స భరత్ చనిపోయాడు. గీత కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
దాడి అనంతరం నిందితుడు ముత్తప్ప పాఠశాల నుంచి పరారీ అయ్యాడు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ముత్తప్ప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముత్తప్ప విద్యార్థిని ఎందుకు చంపాడనేది విషయం తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Babar Azam: కోహ్లీకి సాధ్యంకాని రికార్డు అందుకున్న బాబర్ అజామ్.. రికీ పాంటింగ్ సరసన పాక్ కెప్టెన్
Also Read: 1000 Notes Reentry: 1000 రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా? 2వేల నోట్లు బ్యాన్ నిజమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook