Woman Paraded Naked in Karanataka: కర్ణాటకలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడిపై కక్ష కట్టి.. అతని తల్లిని దారుణంగా శిక్షించారు. బెలగావి జిల్లాలోని ఒక గ్రామంలో ఒక మహిళపై దారుణంగా దాడి చేసి.. వివస్త్రను చేసి విద్యుత్ స్తంభానికి కట్టివేశారు. అప్పటికే మరొకరితో నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయితో ఆమె కుమారుడు పారిపోయాడని ఈ దారుణానికి ఒడిగట్టారు. యువకుడి ఇంట్లోకి చొరబడిన అమ్మాయి బంధువులు.. అతడి తల్లిని ఈడ్చుకెళ్లి.. వివస్త్రను చేశారు. అనంతరం నగ్నంగా ఊరేగించి.. ఆమెను విద్యుత్ స్తంభానికి కట్టేశారు. అర్ధరాత్రి వరకు ఆమెపై దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెలగావి జిల్లాలో కొత్త వంతమూరి గ్రామంలో ఓ యువతి (24), ఓ యువతి (20) ప్రేమించుకున్నారు. యువతికి మరో యువకుడితో కుటుంబ సభ్యులు నిశ్చితార్థం జరిపించారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రేమికులిద్దరు గ్రామం నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటిపై దాడికి దిగారు. ఇంట్లో యువకుడి తల్లి (42) ఉండగా.. ఆమెను వీధిల్లో ఈడ్చుకొచ్చారు. వివస్త్రను చేసి.. నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. గ్రామంలోని రచ్చ బండ వద్ద విద్యుత్ స్తంభానికి కట్టి అర్ధరాత్రి వరకు దాడికి పాల్పడుతూ దారుణంగా ప్రవర్తించారు. ఆ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నా.. గ్రామంలో ఒక్కరు కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. 


ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే గ్రామానికి చేరుకుని బాధితురాలిని రక్షించారు. బెలగావిలోని కేఎల్‌ఈ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా.. నేరం జరిగిన మూడు గంటల్లోనే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర్ గ్రామాన్ని సందర్శించారు. ఇది అమానవీయ ఘటన అని అన్నారు.


"యువతీ యువకుడు పారిపోయిన తరువాత.. యువతి కుటుంబానికి చెందిన 12 నుంచి 15 మంది సభ్యులు యువకుడి ఇంటిపై దాడి చేశారు. తరువాత యువకుడి తల్లిని ఈడ్చుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. ఆమెను వివస్త్రను చేసి.. గ్రామ రహదారిపై ఊరేగించారు. బాధితురాలిని స్తంభానికి కట్టివేసి దాడి చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెకు దుస్తులు ఇచ్చి ఆసుపత్రిలో చేర్పించారు.." అని మంత్రి పరమేశ్వర్ తెలిపారు. గ్రామంలో రెండు కేఎస్‌ఆర్‌పీ ప్లటూన్‌లు, ఇతర సీనియర్ పోలీసు అధికారులు మోహరించారు. కాకతి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎస్‌ఎన్ సిద్రామప్ప తెలిపారు.


Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా


Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి