Kurnool Court: జంట హత్య కేసులో సంచలన తీర్పు.. సంసారానికి పనికి రాని భర్తకు, మామకు ఉరిశిక్ష
Kurnool Court Duo Verdict: సంసారానికి పనికి రాని భర్తను వదిలేసి ఆ యువతి పుట్టింటికి వచ్చింది. తమ పరువు తీసిందని భావించిన అత్తామామలు, భర్త కక్షతో భార్య, ఆమె తల్లిని హత్య చేశారు. ఈ జంట హత్య కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భర్త, మామకు ఉరిశిక్ష వేయగా.. అత్తకు యావజ్జీవ శిక్ష విధించింది.
Kurnool Double Murder Case: పెళ్లయిన అనంతరం ఎన్నో కలలతో అత్తారింటికి వచ్చిన యువతికి దిగ్భ్రాంతికర విషయం తెలిసింది. భర్త సంసారానికి పనికి రాడని నిర్ఘాంతపోయింది. ఈ విషయం అత్తామామలతోపాటు కుటుంబసభ్యులకు చెప్పడంతో భర్త తట్టుకోలేకపోయాడు. నపుంసకుడు అయిన భర్తను వదిలేసి ఆమె పుట్టింటికి వచ్చింది. అయితే తమ పరువు మొత్తం తీసిందని భావించిన అత్తామామలు, భర్త ఆమెను, ఆమె తల్లిని కూడా అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ జంట హత్య కేసులో ఏడాదికే కోర్టు తీర్పునివ్వడం సంచలనం రేపింది. హత్యకు పాల్పడ్డ భర్త, మామతోపాటు హత్యకు సహకరించిన అత్తకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Marriage Turns To Tragedy: తాళి కట్టి వారం కాకముందే.. ఎస్సైతో సహా నవ వరుడు దుర్మరణం
తెలంగాణలోని వనపర్తికి చెందిన వెంకటేశ్ కుమార్తె రుక్మిణి (18)ని ఏపీలోని నంద్యాలకు చెందిన నారపురం శ్రవణ్ కుమార్‌కు ఇచ్చి 1 మార్చి 2023లో వివాహం చేశారు. వివాహం సందర్భంగా కట్నకానుకలు భారీగానే ఇచ్చుకున్నారు. అయితే వివాహం అనంతరం కొత్త దంపతులకు శోభనం జరగలేదు. అనారోగ్యంగా ఉందని శ్రవణ్‌తోపాటు కుటుంబసభ్యులు వాయిదా వేస్తూ వచ్చారు. భర్త నపుంసకుడని తెలిసి రుక్మిణి తల్లిదండ్రులు వెంకటేశ్, రమాదేవి (32) వచ్చి గొడవకు దిగారు. అనంతరం కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లారు. అయితే ఈ గొడవ వలన తమ పరువు పోయిందని శ్రవణ్‌కుమార్ కుటుంబసభ్యులు భావించారు.
Also Read: Movie Chance Fraud: సినిమా ఛాన్స్‌ల పేరిట తన 'కోరికలు' తీర్చుకుని మోసం చేసిన నటుడు
పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించుకుందామని శ్రవణ్‌కుమార్ తన భార్యతోపాటు అత్తామామలను పిలిపించుకున్నాడు. మార్చి 14న ఇంట్లో ఉన్న రుక్మిణి, రమాదేవిని శ్రావణ్‌కుమార్, అతడి తండ్రి వరప్రసాద్ అత్యంత దారుణంగా హత్య చేశారు. కత్తులతో పొడిచి వారిని అంతమొందించారు. అడ్డొచ్చిన రుక్మిణి తండ్రి వెంకటేశ్‌ను కూడా పొడవడంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను త్వరితగతిన పూర్తి చేశారు.
ఈ కేసుపై కర్నూలు నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. జంట హత్యలను తీవ్రంగా పరిగణించిన న్యాయ అధికారి జి.ప్రతిభాదేవి సంచలన తీర్పునిచ్చారు. విచారణ అనంతరం మంగళవారం నిందితులైన శ్రవణ్‌కుమార్, వరప్రసాద్‌కు ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ హత్యలకు సహకరించిన అత్త కృష్ణవేణికి జీవితకాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి ఈ కేసు ఒక గుణపాఠంగా.. కనువిప్పు కలిగేలా చేసిందని కర్నూలు ఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి