Nalgonda Lahari Reddy Murder Case: నల్గొండ జిల్లాలో లహరి రెడ్డి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాంగ్రెస్ నేత రంగసాయిరెడ్డి కుమారుడు వల్లభ్‌రెడ్డిని తన భార్య లహరి రెడ్డి హత్య చేసి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో విస్తుపోయే అంశాలు తెరపైకి వస్తున్నాయి. పెళ్లైనా ఏడాదికే భార్యను వల్లభ్‌రెడ్డి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె గుండెపోటుతో మరణించిందని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ విషయం పోస్టు మార్టం నివేదికలో బయటపడింది. దీంతో వల్లభ్‌ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. హత్య, సాక్ష్యాలు చెరిపివేసినందుకుగానూ 201,302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వల్లభ్‌ రెడ్డి (30) అతని భార్య లహరి (27) ప్రస్తుతం హిమాయత్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. వీరి వివాహం జరిగి సంవత్సరం కాగా.. ఈ నెల 13న రాత్రి లహరిని తీవ్రంగా కొట్టాడు వల్లభ్‌ రెడ్డి. లహరి తలను గోడకు, తలుపునకు బాదాడు. లహరి పొట్టలో కాలుతో బలంగా తన్నడంతో పొట్టలో రెండున్నర లీటర్ల బ్లడ్ బ్లీడింగ్ జరిగింది. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా గుండెపోటు పేరుతో ఆస్పత్రిలో చేర్పించాడు. అనంతరం హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లు అందరిని నమ్మించాడు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 


జూలై 13న లహరి రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 24న వల్లభ్ రెడ్డి తన భార్య దశ దినకర్మ జరిపించాడు. ఈ సందర్భంగా పది వేల మందికి భోజనాలు పెట్టించాడు. అటు కేసు కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా లహరి రెడ్డిది హత్యగా నిర్ధారించుకున్నారు. వల్లభ్‌ రెడ్డి అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.  


నారాయణగూడ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనెల 14న అపోలో ఆసుపత్రి నుంచి తమకు కాల్ వచ్చిందని.. ఆసుపత్రికి వెళ్లి పరిశీలించగా.. లహరి రెడ్డి నుదిటిపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఆమె పెదాలపై కూడా గాయాలు ఉన్నాయని చెప్పారు. గతంలో ఎలాంటి మెడికల్ హిస్టరీ లేదని.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. శరీరంలోపల గాయాలైనట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలడంగా హత్య కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. వల్లభ్ రెడ్డిపై సెక్షన్ 302 హత్య, 201 సాక్ష్యాల తారుమారు కింద కేసు నమోదు చేశామన్నారు.  


లహరి మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవంటూ ఆమె తండ్రి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తమ కూతురు అనారోగ్యంతో బాధపడుతోందని చెప్పారు. ఫీట్స్‌ రావడంతోనే చనిపోయిందని.. తమ వల్లే వల్లభ్ రెడ్డి కుటుంబానికి చెడ్డపేరు వస్తోందన్నారు. పోలీసులు కావాలని కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లాకు చెందిన  ఇద్దరు ప్రజాప్రతినిధులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్లే లహరి కుటుంబ సభ్యులను బెదిరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.


Also Read: Bandi Sanjay: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ టీమ్ రెడీ.. బండి సంజయ్‌కు ప్రమోషన్  


Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి