Tragedy Incident: నలుగురి ప్రాణం తీసిన `పుట్టినరోజు పార్టీ`.. చావులోనూ వీడని స్నేహం
Lorry Auto Hit Four Friends Died In Bhatnavilly: స్నేహితుడి పుట్టినరోజు కోసం విహారానికి వెళ్లి ఎంజాయ్ చేసిన స్నేహితులు అనంతరం తిరుగు ప్రయాణంలో లారీ రూపంలో మృత్యువు ఎదురువచ్చింది. ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతిచెందిన విషాద సంఘటన ఏపీలో జరిగింది.
Road Accident: అర్ధరాత్రి వరకు స్నేహితుడి పుట్టినరోజు సంబరాల్లో పాల్గొన్న యువకులు తెల్లారి ఇళ్లకు బయల్దేరగా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మద్యం మత్తులో మునిగిన వారు అదే మైకంలో వాహనం తోలి ప్రమాదానికి గురయ్యారు. కలిసి చదువుకున్నారు.. కలిసి తిరిగారు. చివరకు మరణంలోనూ ఆ నలుగురు యువకులు కలిసి చనిపోయారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: YS Jagan Convoy: కాన్వాయ్ కిందపడ్డ కుక్క.. చలించిపోయిన సీఎం వైఎస్ జగన్
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ భట్నవిల్లి జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన నవీన్ (22), కొమ్మాబత్తుల జతిన్ (26), నల్లి నవీన్ (27) కాగా.. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన అజయ్ (18) చెందిన యువకులు స్నేహితులు. వీరిలో జతిన్ జన్మదినం కావడంతో ఆదివారం యానాం ప్రాంతానికి స్నేహితులు వెళ్లారు. అక్కడ బర్త్ డే వేడుకలు చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు పార్టీలో మునిగారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతం వరకు పార్టీ చేసుకున్నారు.
Also Read: Tragedy Love: ప్రాణం తీసిన 'కులం' పంచాయితీ.. పంటపొలంలో ప్రేమ జంట ఆత్మహత్య
అనంతరం యానాం నుంచి నలుగురు స్నేహితులు తిరుగుముఖం పట్టారు. స్వగ్రామానికి చేరుకుంటున్న సమయంలో సోమవారం తెల్లవారుజామున అమలాపురం మండలం భట్నవిల్లికి చేరుకోగానే వారు ప్రయాణిస్తున్న ఆటో లారీని ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో ఆటో ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం తీవ్రతతో మరో నలుగురు యువకులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఆటోలో మరో నలుగురు ప్రయాణిస్తుండగా వారు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారి కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆటో డ్రైవర్ కూడా మద్యంమత్తులో ఉన్నాడని తేలింది. మద్యం మత్తులో ఆటోను సక్రమంగా నడపకపోవడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించిందని పోలీసులు చెబుతున్నారు.
మరణించిన స్నేహితుల్లో ఒక్కరి వయసు కూడా 30 నిండలేదు. చదువుకున్న వారు వివిధ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. చేతికొచ్చిన పిల్లలు అర్ధాంతరంగా ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి. జతిన్ పుట్టినరోజు తెల్లారే మరణించడం మరింత విషాదానికి గురి చేసింది. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు వారి మృతిదేహాలను అప్పగించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter