Man Dragged on Car Bonnet: బెంగళూరులోని జ్ఞాన భారతి నగర్‌లో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన కంటే ముందుగా జ్ఞాన భారతి నగర్ ప్రాంతంలో టాటా నెక్సాన్ కాు, మారుతి స్విఫ్ట్ కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రియాంక అనే మహిళ టాటా నెక్సాన్ కారు డ్రైవ్ చేస్తూ స్విఫ్ట్ కారుని ఢీకొట్టింది. ప్రియాంకను నిలదీసేందుకని స్విఫ్ట్ కారులోంచి దిగిన దర్శన్ అనే యువకుడు ఆమె వద్దకు వచ్చాడు. అయితే, దర్శన్ పట్ల దురుసుగా ప్రవర్తించిన ప్రియాంక.. కారు దిగకుండానే అసభ్యకరమైన సైగలు చేస్తూ కారును స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ప్రియాంకను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా దర్శన్ ఆమె కారు బ్యానెట్‌పైకి దూకాడు. అయినప్పటికీ కారును ఆపకుండానే ముందుకు పోనిచ్చిందామె. అలా దాదాపు కిలోమీటర్ కి పైగానే దర్శన్ ని తన కారు బ్యానెట్ పై ఈడ్చుకెళ్లింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనపై వెస్ట్ జోన్ ట్రాఫిక్ డీసీపీ మాట్లాడుతూ.. ప్రియాంక తన కారుతో దర్శన్ కారును ఢీకొట్టిందని తెలిపారు. " దర్శన్ వెళ్లి ఆమెను నిలదీసే ప్రయత్నం చేయగా.. ఆమె అతడిని లెక్కచేయకుండా ముందుకు పోనిచ్చినట్టు ట్రాఫిక్ డీసీపీ చెప్పారు. 


" ప్రియాంక తీరుపై ఆగ్రహం చెందిన దర్శన్.. అతడి స్నేహితులు... ఆమె కారు ఆపిన తర్వాత ఆమెతో వాగ్వాదానికి దిగారు. ప్రియాంక కారుపై దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు. దీంతో తన కారుని ఢీకొట్టడమే కాకుండా తనని కారు బ్యానెట్‌పై ఈడ్చుకెళ్లిన నేరం కింద ప్రియాంకపై దర్శన్ కేసు పెట్టగా.. తన కారుపై దాడికి పాల్పడి కారు భాగాలు ధ్వంసం చేసిన నేరం కింద దర్శన్ పై ప్రియాంక కేసు పెట్టింది " అని డీసీపీ తెలిపారు. ప్రియాంకపై ఐపిసి సెక్షన్ 307 కింద హత్యాయత్నం నేరం మోపుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. దర్శన్‌తో పాటు అతని స్నేహితులపై ఐపిసి సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు.