Man killed his Childhood Friend: ఇంట్లో గొడవపడిన ఒక వ్యక్తి ఆశ్రయం కోసం స్నేహితుడి ఇంటి వద్దకు వెళితే.. అదే స్నేహితుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుని అదే ఇంట్లో సమాధి అయిన ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలుగు చూసింది. ప్రొద్దుటూరు పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఆ క్రైమ్ స్టోరీ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరులోని బొల్లవరం వీధిలో నివాసం ఉంటున్న సతీష్ వయస్సు 46 ఏళ్లు. గత నెల 15వ తేదీన కుటుంబసభ్యులతో గొడవపడిన సతీష్.. ప్రొద్దుటూరులోని పెన్నా నగర్ లో నివాసం ఉంటున్న తన బాల్య స్నేహితుడు కిషోర్ ఇంటికి వెళ్ళాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒంటరిగా ఉంటున్న కిషోర్ తన స్నేహితుడు సతీష్‌తో కలిసి ప్రతిరోజు ఇంట్లోనే మద్యం సేవించేవారు. కిషోర్ తల్లి కూడా హైదరాబాద్‌లో పని చేసుకుంటుండటంతో వారికి అడ్డు చెప్పే వారు కూడా లేకుండా పోయారు. అయితే గత నెల 24వ తేదీన మద్యంకు డబ్బులు ఇచ్చే విషయమై కిషోర్, సతీష్‌ల మధ్య పెద్ద ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ అనంతరం మద్యం మత్తులో పడి ఉన్న సతీష్‌ను కిషోర్ కత్తితో 8 సార్లు దారుణంగా పొడవడంతో సతీష్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు వదిలాడు. 


సతీష్‌ని చంపిన అనంతరం జరిగిన షాక్ నుంచి తేరుకున్న కిషోర్.. సతీష్ మృతదేహాన్ని ఇంట్లోనే ఒక మూలకు చేర్చి దానిపై మట్టి పోసి మృతదేహాన్ని కప్పి పెట్టాడు. ఈ విధంగా 37 రోజులు కిషోర్ మృతదేహంతో ఒకే ఇంట్లో కలిసి ఉన్నాడు. ఇక తను చేసిన నేరం ఎవరికీ తెలియదులే అని అనుకుంటున్న తరుణంలోనే ఇంట్లోంచి ఒక రకమైన దుర్వాసన మొదలైంది. అదే క్రమంలో హైదరాబాద్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కిషోర్ తల్లి కూడా వృద్ధాప్య పింఛన్ తీసుకోవడానికని సొంతూరికి వచ్చింది. ప్రొద్దుటూరులోని ఇంటికి రాగా ఇంటినిండా ఏదో దుర్వాసన రావడంతో కిషోర్‌ తల్లి ఇల్లు అంతా వెతికింది. ఆమెకు ఏమీ కనబడకపోవడంతో వెళ్లి తన కొడుకు కిషోర్‌ని ఆ దుర్వాసన గురించి నిలదీసి అడిగింది. 


ఇది కూడా చదవండి : Fake Death Certificates: అసలు వ్యక్తికే తెలియకుండా ఫేక్ డెత్ సర్టిఫికెట్


తల్లి నిలదీసి అడగడంతో అప్పటి వరకు మట్టిపెట్టి శవాన్ని కప్పిపెట్టినట్టుగా ఉన్న ఆ రహస్యాన్ని తల్లికి చెప్పక తప్పలేదు. కొడుకు పూసగుచ్చినట్టుగా చెప్పిన విషయం విని షాక్ అవడం కిషోర్ తల్లి వంతయ్యింది. తన కొడుకు తప్పు చేశాడని తెలుసుకున్న కిషోర్ తల్లి.. ఆ తప్పును కప్పిపెట్టి ఇంకో తప్పు చేయడం ఇష్టం లేక ఆమె వెళ్లి ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించింది. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. కిషోర్ తల్లి ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కిషోర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. అతడు చెప్పిన వివరాల ప్రకారమే ఇంట్లో సతీష్ శవాన్ని కప్పిపెట్టిన చోట శవాన్ని తవ్వి తీశారు.


ఇది కూడా చదవండి : Woman Brutally Kills Husband: 55 ఏళ్లకు ఎఫైర్.. భర్తను అతి కిరాతకంగా మంచానికి కట్టేసి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి