Chandragiri: భార్యను వదిలేసిపోవాలని కానిస్టేబుల్ వార్నింగ్.. పోలీస్ స్టేషన్‌లోనే నిప్పంటించుకున్న వ్యక్తి
Man set Himself on Fire: తిరుపతి జిల్లాలోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు, స్థానికులు మంటలు ఆర్పివేసి.. ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా..
Man set Himself on Fire: చంద్రగిరిలో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన తిరుపతి జిల్లాలో కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి తన భార్య కేసులో పోలీస్ స్టేషన్‌కు రాగా.. భార్యను వదిలేసిపోవాలని లేకపోతే దొంగతనం కేసులో బొక్కలో వేస్తానని బెదిరించాడు. దీంతో మనస్థాపం చెందిన ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీస్ స్టేషన్‌లోనే ఆర్తనాదాలు చేయగా.. పోలీసులు, స్థానికులు మంటలు ఆర్పివేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా..
విజయవాడకు చెందిన మణికంఠ తమిళనాడు రాష్ట్రం తిరుత్తణికి చెందిన దుర్గను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 8 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల అభయ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడ నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 3 నెలలు క్రితం భర్తతో విభేదించిన దుర్గా తిరుపతికి చేరుకుంది. ఇక్కడికి వచ్చిన తరువాత భాకరాపేట చెందిన సోను అలియాస్ బాషాతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే పగడాల శ్రీనివాసులు సహకారంతో భాకరాపేటలో సహజీవనం చేస్తున్నారు.
ఈ విషయం భర్త మణికంఠకు తెలియడంతో చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. తన భార్య విషయం కానిస్టేబుల్ శ్రీనువాసులను ప్రశ్నించాడు. భార్యను వదిలేసి వెళ్లిపోవాలని.. లేకుంటే దొంగతనం కేసు పెట్టి లోపలేస్తానని మణికంఠను బెదిరించాడు కానిస్టేబుల్. ఈ మాటలతో మనస్థాపం చెందిన మణికంఠ.. స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ నుంచి 5 లీటర్లు తెచ్చుకున్నాడు. అందరూ చూస్తుంగానే.. ఒంటిపై నిప్పటించుకున్నాడు. మంటలకు తాళలేక స్టేషన్‌లోకి ఆర్తనాదాలు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. స్థానికులు మంటలను ఆర్పివేశారు. తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంట
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి